ఆగస్టు 2 వస్తుంది పోతుంది.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్.. ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుందన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించు కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు.…
కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ.. కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు. కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ…
నేడు కార్గిల్‌లో వీర అమరవీరులకు ప్రధాని నివాళి.. ఎత్తైన సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన..! 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లోపర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు. నేటి ఉదయం 9:20 గంటలకు కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు మోడీ నివాళులర్పిస్తారు. అంతేకాకుండా షింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్ )…
ఒలింపిక్ సన్నాహకాల మధ్య పారిస్‌లో ఆస్ట్రేలియా మహిళ పై సామూహిక అత్యాచారం పారిస్‌లో జూలై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించింది. 25 ఏళ్ల ఆస్ట్రేలియన్ యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు రావడంతో ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ ప్యారిస్‌లోని పిగల్లే జిల్లాలో తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. మహిళ సమీపంలోని కబాబ్ షాప్‌లో ఆశ్రయం పొందింది. బాధతో, ఆమె…
డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..! తెలంగాణలో డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాగానే వున్నా…
ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. వెలగపూడి నుండి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి అవకాశం ఉంది. విభజన సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అమిత్‌షాను కోరనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాత్రికి సీఎం చంద్రబాబు…
ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాంకు తెరలేపారు మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే…
మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారం వైసీపీదే..! మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు.. ఇదేనే ప్రభుత్వం పనితీరు..? అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో నెలరోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు.. అధికార పార్టీ పతనం స్టార్ట్ అయ్యిందన్నారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లేడం ఒక ప్రణాళిక…