వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..
వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెజవాడ పోలీసులు.. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాలలోని బాధితులు లేదా ప్రజల వద్ద నుండి సదరు ఏరియాల్లో బోట్లు నడిపే వారు గాని.. పాల ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాలను ఇచ్చే సమయంలో డబ్బులు వసూలు చేసే వారిని కానీ కస్టడీలోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని.. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సీపీ రాజశేఖర బాబు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండీ భవిషత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మంచి కార్యక్రమం చేయలేదన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ లో 90 శాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్ఎస్ నాయకులే అని, నేను ప్రూవ్ చేయడానికి సిద్ధమన్నారు ఆయన. ఆ పాపం అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు దే అని, మామా అల్లుళ్ళకు సుఖర ముఖం శిక్ష పడటం ఖాయం ,తప్పించుకోలేరన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. శిక్ష నుండి తప్పించుకోవడానికే హహరీష్ రావు దేవుళ్ళ దగ్గరకు పోతుండని, హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలను తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండన్నారు.
తెలంగాణ ‘రేపటి కోసం’ .. వైజయంతీ మూవీస్ ఎంత విరాళం ఇచ్చిదంటే?
తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరికంటే ముందుగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు ప్రకటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మొదలుపెట్టి టాప్ హీరోలందరూ అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన వైజయంతి మూవీస్ సంస్థ. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా విరాళం ప్రకటించింది.
బుడమేరు గండి పూడ్చే పనులు.. సీఎంకు వివరించిన మంత్రి లోకేష్
బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్.. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామాగ్రిని అక్కడి పంపిస్తున్నారు లోకేష్. ఇక, బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీఎంకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు లోకేష్. ప్రధానంగా 2, 3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టామని తెలిపారు..
బుడమేరు గండ్లు పూడ్చే వరకు ఇక్కడి నుంచి కదలను.. స్పష్టం చేసిన మంత్రి..
బుడమేరు కాలువకు పడిన గండ్లు పూడ్చే వరకు తాను అక్కడ నుంచి కదిలేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కాలువకు మూడు ప్రాంతాలలో గండి పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఆయన పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాలలో రాత్రి కురిసిన వర్షాలకు మరింత నీటిమట్టం పెరిగినట్లు ఆయన వివరించారు. గూడేరు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కు గండ్లు పడడం వల్ల సింగ్ నగర్, జక్కంపూడి, ఆంధ్రప్రభ కాలనీ, రాజరాజేశ్వరి పేట వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. కాలువ గండ్లు పూడ్చి అక్కడి నుంచి కదులుతానని ఆయన వివరించారు.
వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్‌కు పట్టదు
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు పాకేజ్ ని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతుండు అని ఆయన మండిపడ్డారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదని, యువరాజు కేటీఆర్, ఎలెన్ మాస్క్ x ప్లాట్ ఫామ్ మీద ఉండి మాట్లాడుతుండని, ఆయన ఎక్స్ లో మెసేజ్ లు పెట్టి నవ్వుల పాలు అవుతుండని ఆయన మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ బుల్డోజ పాలన మీద సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిందని, తెలంగాణ హైడ్రా పై కోర్టు తీర్పు ఇచ్చినట్లు కేటీఆర్ వక్రీకరిస్తున్నాడని, హైడ్రా పై ప్రజలను తికమక పెట్టడానికి కేటీఆర్ అలా చేస్తుండన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
తగ్గిన వరద.. మొదలైన బురద క్లీనింగ్ పనులు..
ఓవైపు కృష్ణా నది వరద.. మరోవైపు.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో.. విజయవాడ సిటీ అతలాకుతలం అయ్యింది.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు తిష్ట వేయగా.. చాలా ప్రాంతాల్లో వరద తగ్గింది.. అయితే.. వరదతో బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం.. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రం చేస్తున్నారు సిబ్బంది.. ఏపీ వ్యాప్తంగా ఉన్న వందలాది ఫైరింజన్లలో మెజార్టీ ఫైర్ ఇంజిన్లు బెజవాడకు రప్పించారు.. ఇళ్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.. మరోవైపు.. వరద ఆనవాళ్లను కడిగి పరిశుభ్రం చేయడానికి.. నీరు సరఫరా చేసేలా నీటి ట్యాంకర్లును పెద్ద సంఖ్యలో మోహరించారు అధికారులు..
బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం సైనీ పోటీ ఎక్కడనుంచంటే..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. 67 మందితో కూడిన తొలి జాబితాను బుధవారం సాయంత్రం బీజేపీ ప్రకటించిండి. ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు. హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది. అయితే ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్లు పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొలిక్కి వచ్చాక తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఇక భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం తక్షణ సహాయం 10 వేల నగదు వారి అకౌంట్‌లో జమ చేస్తోంది
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా వెంటనే పూర్తి స్థాయి సహాయ పనులు మొదలు పెట్టామని, శానిటేషన్ వరంగల్ హైదారాబాద్ నుండి కార్మికులు వచ్చారన్నారు మంత్రి తుమ్మల. విద్యుత్ సరఫరా ఇచ్చాము, భోజనాలు అందిస్తున్నామని, నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. ఫైర్ ఇంజన్ అందుబాటులో తెపించామని, రోడ్ల పై ఇండ్ల పై బురద తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల. 2 రోజులలో సాధారణ స్థాయి తీసుకొచ్చిన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందించారని, తక్షణ సహాయం 10 వేలు నగదు వారి అకౌంట్ లో జమ చేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పోలీసులు సిపి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అద్భుత కృషి చేశారని, జిల్లా వ్యాప్తంగా 7400 పైగా కుటుంబాలకు నష్ట పోయినట్లు తాత్కాలిక నిర్ద్రారణ అయినట్లు ఆయన తెలిపారు. 10 టీమ్ లతో హెల్త్ టీమ్ వర్క్ చేస్తోంది..ఇంటి ఇంటికి వైద్య చెకప్ జరుగుతుందన్నారు.