నేడు జరగాల్సిన JNTU పరీక్షలు వాయిదా. 5వ తేదీకి వాయిదా వేసిన JNTU. నేడు ఉస్మానియా పరిధిలోని కాలేజీలకు సెలవు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.
నేడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.
ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద. 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల. ఇన్‌ఫ్టో 11,20,101 క్యూసెక్కులు. కెనాల్స్‌కు 500 క్యూసెక్కుల నీటి విడుదల.
ఏపీకి ఆరు NDRF బృందాలు పంపనున్న కేంద్రం. 40 పవర్ బోట్లు ఏపీకి పంపుతామన్న హోం సెక్రటరీ. ఏపీలో సహాయక చర్యలకు ఆరు హెలికాప్టర్లు. నేటి నుంచి సహాయక చర్యల్లో హెలికాప్టర్లు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,940లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,030 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.91,900 లుగా ఉంది.
ఐటీ కంపెనీలకు సైబరాబాద్ జాయింట్ సీపీ సూచన. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వండి. ఐటీ కంపెనీలకు జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ సూచన.
డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు. 18కి 18 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 2 లక్షల క్యూసెక్కులు దాటిన ఇన్‌ఫ్లో. ఔట్ ఫ్లో 2,65,218 క్యూసెక్కులు. ఇన్‌ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కులు దాటితే మళ్లీ ప్రమాదంలోకి కడెం ప్రాజెక్టు. అప్రమత్తంగా ఉన్న కడెం ప్రాజెక్టు అధికారులు.