సర్వేపల్లిలో జరిగిన అక్రమాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం.. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపఅ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ కు సంబంధించి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది అని ఆరోపించారు. ఒక మొక్క కొట్టకుండా.. రోడ్డు వేయకుండానే కోట్ల రూపాయలలో నిధులు స్వాహా…
ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని…
రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది.. లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు…
మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసి, దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ…
ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కారులో ఉన్నవాళ్లంతా కిష్త్వార్ నుంచి వస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము రీజియన్‌లోని కిష్త్వార్ నుంచి వస్తున్న…
ఆగస్టు 2 వస్తుంది పోతుంది.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్.. ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుందన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించు కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు.…
కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ.. కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు. కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ…
నేడు కార్గిల్‌లో వీర అమరవీరులకు ప్రధాని నివాళి.. ఎత్తైన సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన..! 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లోపర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు. నేటి ఉదయం 9:20 గంటలకు కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు మోడీ నివాళులర్పిస్తారు. అంతేకాకుండా షింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్ )…
ఒలింపిక్ సన్నాహకాల మధ్య పారిస్‌లో ఆస్ట్రేలియా మహిళ పై సామూహిక అత్యాచారం పారిస్‌లో జూలై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించింది. 25 ఏళ్ల ఆస్ట్రేలియన్ యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు రావడంతో ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ ప్యారిస్‌లోని పిగల్లే జిల్లాలో తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. మహిళ సమీపంలోని కబాబ్ షాప్‌లో ఆశ్రయం పొందింది. బాధతో, ఆమె…