తిరుమల భక్తులకు అలర్ట్: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో…
1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు: సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ…
మోహన్బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత: బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్…