EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు.. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక…
తండేల్ పైరసీ.. అరెస్ట్ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తండేల్’. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టడమే కాదు ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై నిర్మాత బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు…
మా లక్ష్యం వికసిత్ భారత్.. అందుకే ప్రజలు మూడోసారి ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆత్మ విశ్వాసం నింపిందని.. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం…
“ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్”.. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ తొలి ఇంటర్వ్యూ పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన మొదటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అన్నారు. అలాగే, నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. మేం…
టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘కేవలం 11 స్థానాలు గెలిచిన కూటమి ఎలా స్థాయి సంగం ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నలుగురికి పచ్చ కండువాలు వేసేశారని.. టీడీపీ పెట్టిన క్యాంప్‌లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు. మేము కోడి పిల్లలను…
ఐదు రోజుల్లో ఓటింగ్.. ఆప్‌కి భారీ ఎదురు దెబ్బ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో నరేష్ యాదవ్ (మెహ్రౌలీ), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్…
ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ.. కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్‌లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద…
పుంగనూరు ఎస్టేట్ వ్యవహారంపై పెద్దిరెడ్డి రియాక్షన్.. పుంగనూరు ఎస్టేట్‌పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. “సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు…
అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే…