యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి.. భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.…
‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్? గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ టైటిల్ ప్రకటనతో పాటు విడుదలైన రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. జాతీయ అవార్డు గ్రహీత, “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ నిర్మాత వెంకట…
రెడ్ జోన్ పరిధిలోకి ఆర్కే బీచ్ ఏరియా: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు…
ఫార్ములా ఈ రేసింగ్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి పది గంటలకు ACB కార్యాలయంలో విచారణ కు వెళ్లనున్నారు. ఈ కారు రేసు కేసులో నీధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలం బిజినెస్ రూల్స్…
యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి, అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్…
హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం.. మెగా స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో, యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే బుధవారం ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ సమీపంలో నిర్మించిన సెట్‌లో ఈ ఘటన సంభవించింది. అయితే సినిమాలోని కీలకమైన సముద్రం సన్నివేశాలు…
నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ…
జ్యోతి మల్హోత్రాకు బెయిల్..? నేడు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..! పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది. ఆమెను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు చేయడం జరుగుతుంది. అయితే, గత విచారణలో, హిసార్ కోర్టు జ్యోతి మల్హోత్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె హిసార్ సెంట్రల్ జైలులోనే…
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని…
ఇరాన్లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు క్షేమం.. రక్షించిన టెహ్రాన్ పోలీసులు ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించినట్లు చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్) వాసులు మే 1న ఇరాన్ వెళ్లారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో ఇరాన్ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు…