ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కేకేఆర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 పున ప్రారంభానికి వరుణుడు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ – సి61…
శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బరంపురం…
భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందులో కాశ్మీర్ అంశంపై కూడా ఉందని పేర్కొన్నారు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే…
సైన్యం భారీ ఆపరేషన్.. మణిపూర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతం.. మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు…
ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే.. డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా పోతుంది. జకియా ఖానం స్వస్థలం…
నేడు కల్లితండాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను…
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా…
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన.. భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం…
ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ పై మెరుపుదాడులు.. భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం…