చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ పుట్టాడు.. ఆయన్ని దేవుడే రక్షించాలి..!
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముని ఆలయంలో ఇవాళ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అంబటి రాంబాబు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట ప్రత్యేకతను సంతరించుకుందన్న ఆయన.. శ్రీరామ నవమి రోజున కుటుంబ సమేతంగా కోదండ రాముణ్ణి దర్శించు కోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. భద్రాద్రి కన్నా ఎంతో విశిష్టమైన ఆలయం ఒంటిమిట్టగా అభివర్ణించారు.. ఇక, చంద్రబాబు, పవన్‌పై విరుచుకుపడ్డారు అంబటి.. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ .. వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడన్న ఆయన.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చెప్పడం.. పోలవరాన్ని నాశనం చేసినట్లే చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగదంతూ సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత ప్రభుత్వం భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలువచ్చాయి.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాలు.. ఇప్పుడు దాని అంచనా వ్యయం పెరిగింది.. 2017-18 నాటి అంచనాలే 50 వేలకు దాటి ఉన్నాయన్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు కోసమే పుట్టాడంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు కోసం పుట్టాడు.. పనిచేస్తున్నాడు.. చేస్తాడు.. కానీ, ఆయన్ను దేవుడే రక్షించాలన్నారు.. ఓటు చీలకుండా చేస్తాం అని పవన్ చెప్పడం ఇప్పుడు కొత్త కాదన్నారు. రాష్ట్రంలోని మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటు కి ఓటు లాంటిది జరిగింది.. నిరూపించ లేక పోవచ్చు.. కానీ, టీడీపీ ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందంటూ ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.
వైసీపీ ఎమ్మెల్యేలెవరూ టీడీపీలో చేరరు.. 2024లోనూ జగనే సీఎం..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారు.. ఎప్పుడైనా మా పార్టీలో చేరతారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న మాట.. అయితే, ఈ ప్రచారాన్ని వైసీపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. వచ్చే 2024 ఎన్నికల్లోనూ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటున్నారు.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పశువుల సంతలో కొన్నట్టు కొనడం ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ పాదయాత్రకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు మంత్రి జయరాం.. పాదయాత్ర అంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ కుటుంబానికే సొంతం అన్నారు.. చంద్రబాబు ప్రజలుకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పే ధైర్యం లేదన్న ఆయన.. 2024 ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు.
ఏజెన్సీ బంద్‌కు ఆదివాసీల పిలుపు.. ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు..
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలకు ఎస్టీహోదా ఇప్పుడు చిచ్చు రేపుతోంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీయేతర రాజకీయ పార్టీలు ఈ ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరోవైపు, మావోయిస్టు ఈ పరిణామాలపై లేఖ విడుదల చేశారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ పేరుతో వచ్చిన ఈ లేఖలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికారపార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పుకొట్టాలని పిలుపు నిచ్చింది. మరోవైపు, ప్రభుత్వం తీర్మానం మేరకు రిజర్వేషన్లు అమలులోకి వస్తే తాము అన్ని విధాలుగా నష్టపోతామనే ఆదివాసీల భయం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్ల కోటాకు గండిపడు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ర్యాలీలు, సాంప్రదాయ ఆయుధాలతో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇక, ఎమ్మెల్యేలు, ప్ర జాప్రతినిధులకు సెగ మొదలైంది. అసెంబ్లీలో తీర్మానంను వ్యతిరేకించనందుకు బాధ్యత వహించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 5,6 షెడ్యూల్లు, 1/70కింద వచ్చిన హక్కుల పరిక్షణకు కట్టుబడాలని పట్టుబడుతున్నారు. ఆదివాసీ సంఘాల బంద్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు పార్టీ కదలికలపై నిఘా పెంచింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెక్యూరిటీని పెంచడంతో పాటు తీవ్రత ఎక్కువగా వున్న చోట్ల జాగ్రత్తలు పాటించాలనే సూచనలు జారీ అయ్యాయి.
యాదాద్రిలో డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు
యాదాద్రి ఆలయం వద్ద డ్రోన్ మళ్లీ కలకలం రేపింది. ఇవాల భద్రాద్రి ఆలయంలో రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో డ్రోన్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమారాతో దేవాలయాన్ని ఎలా తీస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తున్న విషయాన్ని ఆలయ సిబ్బంది పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. డ్రోన్ తో యాదాద్రి ఆలయాన్ని చిత్రీకరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు సాయికిరణ్, జాన్ గా గుర్తించారు. వీరిద్దరూ జీడిమెట్లకు చెందిన వారుగా గుర్తించారు. డ్రోన్ ద్వారా యాదాద్రి ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నరని? ఎవరి అనుమతితో ఇలా చేశారనే దానిపై వీరిద్దరి యువకులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. యువకులను అదుపులో తీసుకోవడంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
థియేటర్ యాజమాన్యం నిర్వాకం.. టికెట్ ఉందని ప్రాధేయపడినా.. వీడియో వైరల్
ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా, రాకెట్లతో అంతరిక్షాన్ని చుట్టి వస్తున్నా దేశంలో అక్కడక్కడ జాతివివక్షలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. దానికి తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఓ సంచార జాతికి చెందిన మహిళ తన పిల్లలతో కలిసి సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్లింది. తన దగ్గర ఉన్న డబ్బులతో టికెట్లు తీసుకుని లోపలికి వెళ్తుండగా సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా నిలిపివేశారు. దానికి కారణం వారు సంచార జాతిలో పుట్టిన వారు కావడమే. చెన్నైలో థియేటర్ యాజమాన్యం నిర్వాకం చూసిన నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రముఖ హీరో శింబు నటించిన ‘పత్తు తల’ సినిమా విడుదల అయింది. చెన్నైలోని రోహిణి థియేటర్‌లో సంచార జాతికి చెందిన వారిని సిబ్బంది అనుమతించలేదు. టికెట్టు ఉంది అనుమతించాలని ప్రాధేయపడినా నిర్వాహకులు కనికరించలేదు. తోటి ప్రేక్షకులు చెప్పినా వినకుండా సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. తమకు ఇష్టమైన హీరో సినిమా చూడడానికి వచ్చిన వారి జాతి వివక్ష పేరుతో ఇలా వెళ్లగొట్టడంపై పలువురు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
భారత్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టా బ్లూ టిక్‌కు ఛార్జీలు.. నెలకు ఎంతంటే..?
సోషల్ మీడియా దిగ్గజాలు ఇప్పుడు వడ్డింపుల బాట పట్టాయి.. దీనికి ఆజ్యం పోసింది మాత్రం ట్విట్టర్ అనే చెప్పాలి.. బ్లూటిక్ కోసం చార్జీలు వసూలు చేస్తోంది ఆ సంస్థ.. ఇక, అదే బాట పట్టాయి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ .. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను వాటి మాతృసంస్థ అయిన మెటా వెల్లడించింది. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది మెటా.. మొబైల్ యాప్ ద్వారా ఎఫ్‌బీని వాడితే నెలకు రూ.1,450 చెల్లించాలని.. అదే డెస్క్‌టాప్ బ్రౌజర్ల వినియోగదారులు అయితే నెలకు రూ.1,099 చెల్లించాలని స్పష్టం చేసింది.. అయితే, ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు బ్లూ టిక్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది మెటా.. ఇక, భారత్‌లోనూ ఇది అందుబాటులోకి రాబోతోంది.. ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు మెటా అదే విధానాన్ని అనుసరిస్తోంది.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ లాగానే, మెటా వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ ఖాతాలకు బ్లూ చెక్‌మార్క్‌ను జోడిస్తుంది. ప్రొఫైల్‌కు బ్లూ టిక్ మార్క్‌ని జోడించడంతో పాటు, మెటా ధృవీకరించబడిన ఖాతాలు ప్రోయాక్టివ్ ప్రొటెక్షన్, డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్, పెరిగిన రీచ్ మరియు ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ట్రాలు వంటి అదనపు ఫీచర్లు మరియు సామర్థ్యాలను కూడా పొందుతాయి. ప్రస్తుతం, మెటా ధృవీకరించబడినది వ్యాపారాలకు మరియు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు అందుబాటులో లేదని స్పష్టం చేస్తోంది.
వరల్డ్ కప్ అర్హత కోసం సౌతాఫ్రికా అవస్థలు
ICC పురుషుల ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు ఇప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు వెస్టిండీస్ మెగా క్రికెట్ ఈవెంట్‌కు ప్రత్యక్ష అర్హత కోసం ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ మిగిలి ఉన్నందున దక్షిణాఫ్రికా నేరుగా అర్హత సాధించడానికి అత్యుత్తమ స్థానాల్లో ఒకటిగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా ఇటీవల వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 1-1 తేడాతో ముగించింది. ఇప్పుడు, దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌తో కేవలం ఒక సిరీస్ మాత్రమే మిగిలి ఉంది.. ఇప్పుడు సిరీస్‌ను గెలుచుకోవడంతో వారు వరల్డ్ కప్ కి అర్హత సాధించడంలో ముఖ్యమైనది.. తద్వారా వారు నేరుగా ICC పురుషుల ODI క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించగలరు. బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌తో రేపు బెనోనిలో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. సిరీస్ యొక్క ప్రాముఖ్యత దృష్యా దక్షిణాఫ్రికా జట్టు క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసాండా మగాలా, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి మరియు అన్రిచ్ నార్ట్జే వంటి ఆటగాళ్లతో కూడిన పూర్తి స్థాయి జట్టును ప్రకటించింది.
కార్తీక్ ఆర్యన్ పెళ్లి వీడియో లీక్…వధువు ఎవరంటే..
బాలీవుడ్ నటులులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒక్కడు కార్తిక్ ఆర్యన్. అమ్మాయిలకు ఆర్యన్ ను తెగ ఇష్టపతారు. ఆకర్షణీయమైన రూపం, ఆహ్లాదకరమైన వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ తన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం సిక్రెట్ గా ఉంటాడు. అభిమానులు అతని వ్యక్తిగత జీవితం గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఇప్పుటు కార్తిక్ ఆర్యన్ పెళ్లి అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మధ్య కార్తీక్ ఆర్యన్ ‘వివాహం’ చేసుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరస్ అవుతోంది. అయితే వైరల్ వీడియో నటుడి అసలు వివాహానికి సంబంధించినది కాదు. ఇది అతని రాబోయే చిత్రం ‘సత్యప్రేమ్ కి కథ’ సెట్స్ నుండి లీక్ అయిన వీడియో. ఇందులో కియారా అద్వానీ కూడా నటించింది. ఈ వీడియోలో కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్‌లు ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో వధూవరులుగా ఉన్నారు. వారు ఫెరాలను తీసుకొని తెల్లటి సాంప్రదాయ వివాహ దుస్తులలో కవలలను చూడవచ్చు.