Free Tomatoes For Flight Bookings in Madurai: ప్రస్తుతం భారతదేశం అంతటా ‘టమాటాలు’ పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఎవరిని కదిలించినా టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం టమాటాల ధర ఎక్కసారిగా పెరగడమే. కిలో టమాటాల ధర కొన్ని రాష్ట్రాల్లో రూ. 200 ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ. 150కి పైగా ఉంది. దాంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల దృష్ట్యా టమాటాలు కూడా విలాస వస్తువుల జాబితాలో…
Tomato: దేశంలో టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమాటా రేటు రూ.250కి చేరింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో అయితే కిలో టమాటా రూ. 150-200 మధ్య పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. వినియోగదారుడికి అందుబాటు ధరలో టమాటాను అందించేందుకు సిద్ధమవుతోంది.
Maharashtra Woman Getting Tomatoes As A Birthday Gift: మధ్యతరగతి కుటుంబ వంట గదిలో ‘టమోటా’దే రాజ్యం. ప్రతి వంటలోనూ టమోటా హస్తం ఉండాల్సిందే. అప్పుడే ఆ కూరకు రుచి వస్తుంది. టమోటా కూర, టమోటా రసం, టమోటా చట్నీ, టమోటా జ్యూస్.. ఇందులో ఏదో ఒకటి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏ వంటకంలో అయినా టమాట ముక్కకి వాటా ఉంటుంది. కిలో టమోటా రూ. 20 లేదా 30కి దొరకడం…
దేశంలో రుతుపవనాల ప్రారంభంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాల ధరలు చాలా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.150 దాటింది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు రెస్టారెంట్లపైనా పడుతోంది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. బర్గర్ లో టమోటాలు పెట్టడం లేదని.. దీనివల్ల రుచిలో మార్పు ఉంటుందని తెలిపింది.
టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో దానిని కొనుగోలు చేయడమే మానేశారు. గత రెండు వారాల్లో దేశంలోని వివిధ నగరాల్లో టమాటా ధర జెట్ స్పీడ్ వేగంతో పెరిగి 100ను దాటింది. దీంతో కొన్ని నగరాల్లో కిలో రూ.120 ధరకు విక్రయించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు టమోటాలు మరింత ఖరీదైనవిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో టమోటా రిటైల్ ధర కిలో రూ. 160కి చేరుకుంది.
Tomato: ధనికుడికైనా, పేదవాడికైనా దేశంలోని ప్రతి ఇంటిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కచ్చితంగా ఉండాల్సిందే. బంగాళదుంపలు, ఉల్లిపాయలు ప్రస్తుతం ప్రజల వంటగదిలో కనిపిస్తున్నాయి. కానీ వాటి జతగాడైన టమాటా మాత్రం అదృశ్యమయ్యాయి. వాటి ధర అమాంతంగా పెరగడమే కారణం.