Maharashtra farmer becomes millionaire in a month by selling tomatoes: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్, అతని కుటుంబం నెలలో 13,000 టమాటా బాక్సులను విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు. తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 12 ఎకరాల భూమిలో కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహకారంతో టమాట సాగు చేశాడు. వారు నాణ్యమైన టమాటాలు పండిస్తున్నారని.. ఎరువులు, పురుగుమందుల గురించి వారికి జ్ఞానం ఉండడంతో తమ పంట తెగుళ్ల నుంచి సురక్షితంగా ఉండేలా చూసుకోవడంలో సహాయపడుతుందని కుటుంబం తెలిపింది. నారాయణగంజ్‌లో ఒక టమాటా బాక్సును అమ్మడం ద్వారా రైతు ఒక్కరోజులో రూ.2,100 సంపాదించాడు. గయాకర్ శుక్రవారం నాడు మొత్తం 900 బాక్సులను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు.
Also Read: Asaduddin Owaisi: మీ గేదె పాలు ఇవ్వకపోయినా మాదే తప్పా?.. హిమంతకు ఒవైసీ కౌంటర్
గత నెలలో టమాటా డబ్బాలను నాణ్యత ఆధారంగా ఒక్కో బాక్సుకు రూ.1000 నుంచి 2,400 వరకు విక్రయించగలిగాడు. పుణె జిల్లాలోని జున్నార్‌లో టమాటాలు పండిస్తున్న చాలా మంది రైతులు కోటీశ్వరులుగా మారారు. ఈ కమిటీ టమాటా విక్రయం ద్వారా నెల రోజుల్లో రూ.80 కోట్ల వ్యాపారం చేసి ఆ ప్రాంతంలో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించింది.
Also Read: Floods Effect: హిమాచల్‌లో వరుణ బీభత్సం.. రూ.2వేల కోట్లు మధ్యంతర సాయం కోరిన రాష్ట్రం
తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకేజింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, అతని కుమారుడు ఈశ్వర్ విక్రయాలు, నిర్వహణ, ఆర్థిక ప్రణాళికలను నిర్వహిస్తున్నారు. మార్కెట్‌కు అనుకూలమైన పరిస్థితులు నెలకొనడంతో గత మూడు నెలలుగా శ్రమించిన ఫలితం దక్కింది. నారాయణగంజ్‌లో ఉన్న ఝున్ను వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ మార్కెట్‌లో నాణ్యమైన (20 కిలోలు) టమాటా అత్యధికంగా రూ.2,500, అంటే కిలో రూ.125. టమోటాలు అమ్మి రైతులు లక్షాధికారులుగా మారడం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు. కర్నాటకలోని కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం ఈ వారం 2,000 టమాట పెట్టెలను విక్రయించి రూ.38 లక్షలతో ఇంటికి తిరిగి వచ్చింది.