టమోటాలకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే బంధువులను టమాటా తీసుకురమ్మనే పరిస్థితి నెలకొంది. ఇండియాలో ఉంటున్న తల్లి.. దుబాయ్ నుంచి వస్తున్న తన కూతురిని టమోటాలు తీసుకురమ్మని చెప్పింది. ఇ
టమాట ధరలు తగ్గుముఖం పడతాయా అని ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఆందోళన కలిగించే వార్త. ఇప్పుడు టమోటా రుచిని రుచి చూడాలంటే ప్రజలు కొన్ని రోజుల పాటు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో టమాట ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తుంది.. ప్రస్తుతం మార్కెట్ లో ధర రూ.200 పలుకుతుంది.. ప్రభుత్వం సబ్సిడీ కింద టమోటాలను ఇస్తున్నా అవి అందరికి అందటం లేదు.. దాంతో ప్రజలు టమోట కూరలకు స్వస్తి పలుకుతున్నారు.. ఈమేరకు ప్రభుత్వం…
క్యాప్సికం ధర కిలో రూ.200కి చేరింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో క్యాప్సికం అధిక ధర పలుకుతుంది. అక్కడ టొమాటో కంటే క్యాప్సికమ్ ఖరీదు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Tomato: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది.
Tomatoes Tulabharam in Anakapalli Nukalamma Temple: సాధారణంగా దేవాలయాల్లో నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. బెల్లం, పంచదార లేదా నాణేలతో తులాభారం వేస్తుంటారు. ఇది మన ఆనవాయితీ. అయితే ఇప్పటివరకూ ఎవరూ వేయని ఓ అరుదైన తులాభారం జరిగింది. తన కూతురిపై ఉన్న ప్రేమతో ప్రస్తుతం ఎంతో ఖరీదైన టమాటాలతో తులాభారం వేశారు తల్లిదండ్రులు. తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో (Tomatoes Tulabharam in AP) చోటుచుకుంది.…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్‌ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.
టొమాటోతో కొంతమందికి హాని కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు టమోటాలు హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వారికి టొమాటో తినడం వలన కడుపు మంట వస్తుంది. అంతే కాకుండా.. టొమాటోలు తిన్న తర్వాత గుండెల్లో మంట, అజీర్ణం లేదా జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండటం మంచిది.
విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది.