ఈమధ్యకాలంలో చాలామంది రాత్రిపూట ఏ ఆహారం దొరికితే అది తినేస్తారు. ఏదో తిన్నాంలే అనే భావన అందరిలోనూ ఉంటోంది. అంతేకాకుండా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ అందుబాటులోకి వచ్చాక ఆహారపు అలవాట్లలో విపరీతమయిన ధోరణి కనిపిస్తోంది. ఎక్కువమందిలో నిద్రపట్టక పోవడం అనేది కనిపిస్తోంది. రాత్రి సమయంలో మనం తీసుకునే భోజనం కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రి భోజనంలో తినకూడని కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి. ఎంత ఆరోగ్యానికి ప్రయోజనమైనా రాత్రి సమయంలో పలు రకాల ఆహారపదార్థాలను తీసుకోకూడదు.
* రాత్రి సమయంలో గడ్డ పెరుగు లాంటిది అసలు తీసుకోకూడదు.. రాత్రంతా మెదడు చురుగ్గా ఉండేందుకు ఈ పెరుగు సరిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని ఉత్పత్రి చేసి కఫానికి దారి తీస్తుంది.
*కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ దానిని రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే గాఢ నిద్రకు ఆటంకాలు కలిగించే కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి భోజనంలో కాలీఫ్లవర్‌ను తినకపోవడమే మంచిది.
Read Also: Bride Cancel Marriage: కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు
* రాత్రి భోజనంలో సలాడ్‌తో టొమాటోలను ఎప్పుడూ తినకూడదు. ఇందులో టైరమైన్ అనే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే రాత్రిపూటు సలాడ్స్ తినండి కానీ అందులో టొమాటో ఉండకుండా చూసుకోండి.
*బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలిసిందే. అయితే డిన్నర్‌లో బ్రకోలీని ఎప్పుడూ తినకూడదు. బ్రకోలీలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
* రాజ్ మా ఆరోగ్యానికి ఎంతోమంచిది. అందులో కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సీ వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నా రాత్రి సమయంలో రాజ్ మా తినకూడదు. కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తిచేస్తుంది. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను మాత్రం రాత్రి అస్సలు తినకండి.
* రాత్రిపూట సాధ్యమయినంత వరకూ 7-8 గంటల లోపు భోజనం ముగించండి. అర్థరాత్రిళ్ళు టిఫిన్ సెంటర్ల పై పడి మైసూర్ బోండాలు, వెరైటీ దోసెలు తిన్నారంటే అంతే సంగతులు.. రాత్రిపూట తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? పక్షులు సూర్యస్తమయం తర్వాత ఆహారం ముట్టవు. వాటి క్రమశిక్షణ మనం ఆలవాటు చేసుకోవాలి.