ఏ కూరలోనైనా టమాటా ఉండాల్సిందే.. ఉల్లి గడ్డతో పాటు టమాటాకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.. అయితే, టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. గత నెలలో గరిష్ఠంగా కిలో 30 రూపాయలు పలికిన టమాటా ధర.. బహిరంగ మార్కెట్‌లో 40 రూపాయల వరకు అమ్ముడు పోయింది.. అయితే, వర్షాలతో టమాటా పంట దెబ్బతినడంతో.. మార్కెట్‌కు వచ్చే పంట కూడా తగ్గిపోయింది.. దీంతో టమాటా ధర క్రమంగా పైపైకి కదులుతోంది.. Read Also: తన జన్మదిన వేడుకల్లో…
మనదగ్గర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటుగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమోటా 40 వరకు పలుకుతున్నది. టమోటాతో పాటుగా మిగతా కూరగాయల ధరలు కూడా అలానే ఉన్నాయి. అయితే, మనదగ్గర టమోటా రూ.40 వరకు ఉంటే అమెరికాలు రెండు పౌండ్ల టమోటా (కిలో) ఏకంగా రూ.222 ఉన్నది. ఒక్క టమోటా మాత్రమే కాదు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా ఉన్నాయి. కిలో క్యారెట్ రూ.163, కిలో వంకాయలు రూ.444,…
రెండు వారాల క్రితం వరకు కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో కాయగూరల ధరలు పెరగడం మొదలుపెట్టాయి. చేతికి రావాల్సిన పంట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మహారాష్ట్రలో ఉల్లి పంట పాడైపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో ఉల్లి ధర రూ.25 వరకు ఉండగా, ఇప్పుడు ఆ ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర ఇప్పుడు రూ.50కి చేరింది. అటు టమోటా ధరలు సైతం…
టమోటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. కిలో ధర ఏకంగా రూపాయికి పడిపోయింది.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది టమోటా ధర.. ఇవాళ కిలో టమోటా ఒక్క రూపాయికే అమ్ముడు పోయింది.. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.. వారికి మద్దతుగా రైతు సంఘం ధర్నా చేపట్టింది.. టమోటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ లో ధర్నా చేశారు అన్నదాతలు.. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని…