బర్త్‌డే గిఫ్ట్‌గా 4 కేజీల టమోటాలు.. తెగ ఆనందపడిపోయిన మహిళ!
మధ్యతరగతి కుటుంబ వంట గదిలో ‘టమోటా’దే రాజ్యం. ప్రతి వంటలోనూ టమోటా హస్తం ఉండాల్సిందే. అప్పుడే ఆ కూరకు రుచి వస్తుంది. టమోటా కూర, టమోటా రసం, టమోటా చట్నీ, టమోటా జ్యూస్.. ఇందులో ఏదో ఒకటి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏ వంటకంలో అయినా టమాట ముక్కకి వాటా ఉంటుంది. కిలో టమోటా రూ. 20 లేదా 30కి దొరకడం కూడా విరివిగా వాడడానికి ఓ కారణం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. టమోటాలు అంటేనే జనాలు భయపడిపోతున్నారు. అందుకు కారణం టమోటాల ధరలు అమాంతం పెరగడమే.
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా టమోటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల కిలో టమోటా ధర రూ. 150 ఉంటే.. మరికొన్ని చోట్ల రూ. 200 కూడా ఉంది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో అయితే కిలో టమోటా 250 కూడా ఉంది. చిల్లర దుకాణాల్లో ఈ ధర మరింత ఎక్కువగా ఉంది. ఆకాశాన్నంటుతున్న టమాటాల ధరలు సామాన్య ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా సగటు జీవి తన బాధను గుండెల్లో దాచుకొని.. మీమ్స్, ఫన్నీ ఘటనలతో తెగ నవ్వుకుంటున్నారు.
బ్రిజ్‌భూషణ్ విచారణ చేయబడతారు, శిక్షించబడతారు.. ఛార్జిషీట్‌లో పోలీసులు
ఆరుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆయన విచారణను ఎదుర్కోవచ్చని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 15 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు ప్రాథమికంగా తీసుకున్నారు. ఈడీ కేసులో ఆయన వాంగ్మూలాన్ని కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ జులై 18న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదులపై దర్యాప్తు ఆధారంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను విచారించవచ్చని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. లైంగిక వేధింపులు, వేధింపులు, వెంబడించడం వంటి నేరాలకు గానూ విచారణకు,శిక్షకు అర్హుడని చార్జ్‌షీట్‌లో తెలిపారు.
నేటి నుంచి వెస్టిండీస్‌తో భారత్ తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైస్వాల్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్‌లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్‌లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది. ఈ సారి వెస్టిండీస్ రూపంలో బలహీన ప్రత్యర్థి భారత్ ముందుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో గణనీయమైన ఎదురుదెబ్బను ఎదుర్కొన్న వెస్టిండీస్.. టీమిండియాకు ఏ మాత్రం పోటీనివ్వగలుగుతుందో చూడాలి. అదనంగా, రెండు జట్లకు చెందిన కొంతమంది ఆశాజనక యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేస్తారని, వారికి విలువైన అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది.
భారీ వర్షాలు.. నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర
నిరంతర భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం నిరంతర ప్రతికూల వాతావరణం కారణంగా సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ వద్ద ప్రయాణికులను నిలిపివేసింది. వర్షం కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు శిధిలాల కారణంగా మూసివేయబడ్డాయి. భారీ వర్షాల కారణంగా మందాకిని, అలకనంద నదులు ఉప్పొంగుతున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలావుండగా, ఈ ప్రాంతంలో భారత వాతావరణ శాఖ భారీ వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో చేసిన ముందస్తు జాగ్రత్తల గురించి ముఖ్యమంత్రి పుష్కర్ ధామి మాట్లాడుతూ.. “ప్రతి సంవత్సరం ఇక్కడ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అధిక వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడతాయి, నదుల నీటిమట్టం పెరుగుతోంది.
కష్టపడ్డా.. అనుష్క శెట్టితో చేశా! నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ వైరల్
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నవీన్ పొలిశెట్టి బాగా పాపులర్ అయ్యాడు. కామెడీ డైలాగ్స్, కామెడీ టైమింగ్, హావభావాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఆచితూచి సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా తెరకెక్కితోంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 4న విడుదల కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ‘లేడీ లక్’ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి కాలేజ్‌కు వెళ్లిన నవీన్ పొలిశెట్టి.. అక్కడి విద్యార్థులతో సందడి చేశాడు. లేడీ ఫ్యాన్స్‌తో స్టేజ్ మీద డాన్స్ వేశాడు. అంతే కాకుండా మంత్రి మల్లారెడ్డి డైలాగులతో అందరినీ నవ్వించేశాడు.
యమున ఉగ్రరూపం.. ఢిల్లీకి వరద ముప్పు
ఉత్తరాది రాష్ట్రాలను గత మూడ్రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది. బుధవారం తెల్లవారుజామున ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రాజధానిలో వరదల భయాన్ని ప్రేరేపించింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ మహోగ్రంగా ప్రవహిస్తోంది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించి, యమునా పరీవాహక ప్రాంతాల్లో నివసించే వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఉద్దేశించిన బెంచీలు కూడా నీట మునిగాయి.
సికింద్రాబాద్‌లో భారీ చోరీ.. రూ.5 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన నేపాలి గ్యాంగ్
ఎవరిని నమ్మకూడదు ఇది పెద్దల చెప్పే మాట. గుడ్డిగా నమ్మి ఎదుటివారికి చేతికి తాళాలు అప్పగించామో మనం ఇంట్లో వున్న సొత్తును మరిచిపోవాల్సిందే.. వందలో ఒకరు మాత్రమే నీతి నిజాయితీగా ఉంటారు. వందకు వందశాతం డబ్బును చూస్తే ఆగలేరు. నమ్మకాన్ని పక్కనపెట్టి అందికాటికి దోచుకుని అక్కడి నుంచి జారుకుంటారు. ఓ యజమానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఇంట్లో నమ్మకంగా ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓవ్యక్తిని నమ్మి ఇంటినే అప్పగించేశాడు. ఇదే అలుసుగా భావించిన ఆ వ్యక్తి ఐదేళ్లుగా స్కెచ్ వేసుకుని ఇంటినే గుల్లచేసి పరారయ్యాడు. ఒకటి కాదు రెండుకాదు కోట్లల్లో దొచుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.