సినీ సెలెబ్రెటీలకు తమ సినిమాల్లో నవరసాలూ పలికించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం తమ పిల్లలు వాళ్ళు చేసే కొన్ని సన్నివేశాలను చూడడానికి పెద్దగా ఇష్టపడరు. పిల్లలు కూడా సినిమాల్లో తమ తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరపై చూడటానికి ఇష్టపడరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా తన తండ్రి సినిమాల్లో అలాగే కొన్ని సీన్లను చూడడానికి అస్సలు ఇష్టపడదట.
Read Also : ‘అఖండ’ చూస్తూనే ఆగిన అభిమాని గుండె.. జై బాలయ్య అంటూనే
ఇటీవల ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌ను ఒక హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా విలన్‌లతో ఫైట్ చేస్తున్నప్పుడు ఆయన పిల్లలు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. దీనిపై మహేష్ స్పందిస్తూ “వాళ్లకు యాక్షన్ పార్ట్ వారికి నచ్చదు. ఫైట్ సన్నివేశం వచ్చినప్పుడల్లా వారు బయటకు వెళతారు. ముఖ్యంగా నా కుమార్తె. సితార ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను చూడటం ఇష్టపడదు. ఇక యాక్షన్ పార్ట్స్‌కాకుండా తన పిల్లలు తన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారూ” అంటూ చెప్పుకొచ్చారు మహేష్. తన ప్రతి సినిమాని మహేష్ విడుదలైన మొదటి రోజు తన ఇంట్లో కుటుంబంతో కలిసి చూస్తాడు. ఆయన దానిని అద్భుతమైన అనుభవం అని అంటున్నారు. తన పిల్లలు పెరిగేకొద్దీ వారి సున్నితత్వాన్ని తెలుసుకోవడం తండ్రిగా తనకు బహుమతినిచ్చే అనుభవం అని మహేష్ చెప్పాడు.
ప్రస్తుతం మహేష్ తన నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది.