ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు కన్నుమూశాడు. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు. ఇక అబ్బవరం కిరణ్ ఇటీవలే “ఎస్ఆర్ కల్యాణ మండపం”లో హీరోగా కన్పించిన విషయం తెలిసిందే.
Read Also : సిరివెన్నెలకు మెగా ఫ్యామిలీ నివాళి
రామాంజులు రెడ్డి మృతితో ఆయన ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు కిరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.