ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా కలకలం సృష్టిస్తోన్న సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు.. సినీ పరిశ్రమను వేధిస్తోన్న మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం.. తాజాగా, సీఎం వైఎస్ జగన్‌ను సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, ఎస్‌ఎస్ రాజమౌళి, నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు కలిసిన విషయం తెలిసిందే.. ఈ భేటీతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఉన్నారు. అయితే, ఈ భేటీపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… సినీ ప్రముఖులు-సీఎం జగన్ భేటీపై స్పందిస్తూ.. కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసిన ఆయన.. “సుపారీ మీడియా ఏడుపు చూస్తుంటే సినీ ప్రముఖులు సీఎం జగన్‌ని కలవడం పచ్చ పార్టీలో పెద్దపెద్ద కలకలమే లేపినట్టుందని అన్నారు. ఇక, చంద్రబాబు, ఆయన తనయుడు రాత్రి భోంచేసి ఉండరంటూ ఎద్దేవా చేసిన ఆయన.. యజమానుల బాధ చూసి పార్టీ నాయకులూ పొర్లిపొర్లి శోకాలు పెట్టి ఉంటారని సెటైర్లు వేశారు.. సినిమావాళ్లు చర్చలకు వెళ్తే ఇన్ని ఆర్తనాదాలు అవసరమా? అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు సాయిరెడ్డి.
సుపారీ మీడియా ఏడుపు చూస్తుంటే సినీ ప్రముఖులు సిఎం జగన్ గారిని కలవడం పచ్చ పార్టీలో పెద్ద పెద్ద కలకలమే లేపినట్లుంది. బాబు గారు, ఆయన తనయుడు రాత్రి భోంచేసి ఉండరు. యజమానుల బాధ చూసి వీళ్లూ పొర్లి పొర్లి శోకాలు పెట్టి ఉంటారు. చర్చలకు వెళ్తే ఇన్ని ఆర్తానాదాలు అవసరమా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 12, 2022