జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నాని మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లను మూసి వేయించిందనటం అబద్దమన్నారు. ఏపీలో మూడు రోజుల నుంచి 510 థియేటర్స్‌లో ‘లవ్ స్టోరీ’ చిత్రం ఆడుతోంది. మొదటి రోజు నిర్మాతకి వచ్చింది 3 కోట్ల 81 లక్షలని పేర్కొన్నారు. రెండవ రోజు నిర్మాత షేర్.. 2…
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుని ఇప్పుడిపుడే సినిమాల విడుదలలు ఊపందుకుంటున్నాయి. గత వారం ‘పాగల్, రాజరాజచోర’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా ఈ వారం ‘శ్రీదేవి సోడాసెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు’ పలకరించాయి. వచ్చే వారం ‘సీటీమార్’, ఆ పై వారం ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతున్నాయి. ఇక ‘లవ్ స్టోరీ’ విడుదలవుతున్న రోజునే ఓటీటీలో నాని నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్ ని అధికారికంగా ప్రకటించారు. Read Also: ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ…
గత శుక్రవారం అంటే జూలై 30న ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లను పుల్ చేసేంత మాస్ అప్పీల్ హీరో సత్యదేవ్ కు లేకపోవడంతో కలెక్షన్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. అలానే ఈ సినిమాతో పాటు విడుదలైన ‘ఇష్క్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎవరూ ఆ మూవీ గురించి చర్చించడం లేదు. ఇక ఈ రెండు సినిమాతో పాటు వచ్చిన మరో మూడు సినిమాల గురించి కూడా జనాలు…
గత నెల (జూన్) 20 నుండి తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని చెప్పేశారు. అంతే కాకుండా అక్టోబర్ నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలలో సినిమాలను విడుదల చేయవద్దంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ తీర్మానం కూడా చేసింది. అయితే… శనివారం తమ సమస్యలను…
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు కూడా…