జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నాని మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లను మూసి వేయించిందనటం అబద్దమన్నారు. ఏపీలో మూడు రోజుల నుంచి 510 థియేటర్స్‌లో ‘లవ్ స్టోరీ’ చిత్రం ఆడుతోంది. మొదటి రోజు నిర్మాతకి వచ్చింది 3 కోట్ల 81 లక్షలని పేర్కొన్నారు. రెండవ రోజు నిర్మాత షేర్.. 2 కోట్ల 80 లక్షలని తెలిపారు. ఇదే తెలంగాణ థియేటర్లతో కంపేర్ చేసుకొని చూస్కోండి తేడా ఏంటో మీకే తెలుస్తోందని పవన్ కు కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో 1100 థియేటర్స్ ఉంటే 800 థియేటర్లు తెరిచారన్నారు. తెలంగాణలో 519 ఉంటే 413 థియేటర్లు మాత్రమే తెరిచారన్నారు. సీఎం జగన్ పై విషం చిమ్మడానికే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. నేను చెప్పిన లవ్ స్టోరీ వసూళ్ళు నిజమో, కాదో తెలియాలంటే నిర్మాత నారాయణ్ మాట్లాడాలని మంత్రి పేర్ని నాని కోరారు.
సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. పవన్ తిట్టాల్సి వైసీపీని కాదని, దమ్ముంటే కేసీఆర్ ని, తెలంగాణ పోలీసులను తిట్టాలన్నారు. సాయితేజ్ యువనటుడు, చాలా మంచివాడని త్వరగా కోలుకోవాలని వైసీపీ పార్టీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి అంతా కోరుకున్నాం వాళ్లమని మంత్రి పేర్ని నాని తెలిపారు.
కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తోందని.. దమ్ముంటే అమిత్ షా నిలదీయండి అంటూ మంత్రి నాని ఫైర్ అయ్యారు. మీ రెమ్యూనరేషన్ లో కూడా ఎందుకు టాక్స్‌లు, జిఎస్టీలు ఎందుకు కట్టాలని మోడీని ప్రశ్నించాలంటూ మంత్రి పేర్ని నాని సూచించారు. ఆ పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.