Varsha Bollamma: సోషల్ మీడియాలో మునిగితేలిపోయేవాళ్లు మాట్లాడుకొనే భాష వేరుగా ఉంటుంది. అదే మీమ్ భాష. ఒక సినిమాలో వచ్చే డైలాగ్ ను.. తమకు నచ్చిన విధంగా మార్చుకొని.. ఆ సిచ్యుయేషన్ కు తగ్గట్టు మాట్లాడకుండా ఈ ఒక్క మీమ్ చెప్తే చాలు. అంతే ఖతమ్.. అర్థమైనవాడు ఓకే అనుకుంటాడు. అర్ధం కానీ వాడు గురించి చెప్పాలంటే.. ఇంకాఎదగాలి భయ్యా అనేస్తారు.
Bhama Kalapam 2: హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు మిలియన్స్కు పైగా వ్యూయింగ్ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్గా భామాకలాపం 2 రానుంది.
Meera Jasmine: మీరాజాస్మిన్.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన హీరోయిన్ మీరా జాస్మిన్. మలయాళం హీరోయిన్ అయినా నిండైన చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచులాగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె .. భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు.. ఇలా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
Mukesh Gowda: తెలుగు ప్రేక్షకుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక నటుడును మనసులో పెట్టుకున్నారు అంటే.. వారు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అది సినిమా అయినా, సీరియల్ అయినా.. ఇప్పుడు ఉన్న కాలంలో సినిమా హీరోల కన్నా, సీరియల్ హీరోస్ కే ఎక్కువ స్టార్ డమ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. సీరియల్స్ ద్వారా స్టార్స్ అయినవారు చాలామంది ఉన్నారు.
Chiranjeevi: ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ను రిలీజ్ అయింది.
DOP Senthil Kumar:ప్రముఖ డీవోపీ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కొద్దిసేపటి క్రితమే మృతిచెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ మరియు రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు.
Ashish Reddy: యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. అద్వైత రెడ్డితో అతడి వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక టాలీవుడ్ లో సగానికి పైగా ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు.
Oy Movie: ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అప్పట్లో హిట్ అయిన సినిమాలు, ప్లాప్ అయినా సినిమాలు అని తేడా లేకుండా అకేషన్ కు తగ్గట్టు స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేసి అభిమానులకు మంచి బూస్ట్ ఇస్తున్నారు. అప్పట్లో హిట్ అవ్వని సినిమాలు.. ఇప్పుడు కల్ట్ సినిమాలు అనే పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు.
Footage: మలయాళ నటి మంజు వారియర్ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేయనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు పరిచయమే. 40 దాటినా కూడా కుర్రహీరోయిన్లకు ధీటుగా ఆమె అందాన్ని మెయింటైన్ చేయడంతోనే అంత పాపులారిటీని తెచ్చుకుంది.
Priyanka Singh: ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి.. బిగ్ బాస్ లోకి వెళ్లి తనలాంటి వారికి కూడా గుర్తింపు కావాలని చెప్పుకొచ్చి.. పేరు తెచ్చుకుంది. ఇక అమ్మాయిగా మారడానికి ఎంతో కష్టపడింది. ఎన్నో అవమానాలను భరించింది. ఇంట్లో తల్లిదండ్రులే అర్ధం చేసుకోకపోతే బయటికి వచ్చి ఒక్కత్తే కష్టపడి సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారింది.