Divi Vadthya: నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది. ఇక బిగ్ బాస్ తరువాత దివి.. అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ మధ్యనే దివి లంబసంగి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. భరత్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు.
తాజాగా భరత్ రాజ్, దివి జంటగా దావత్ షోలో సందడి చేశారు. ఇక ఈ షోలో దివి.. తన గతాన్ని నెమరువేసుకుంది. అవకాశాల కోసం ఎంతగా తిరిగింది.. ? అవకాశాలు రాక ఎలా ఏడ్చింది.. ? అన్ని చెప్పి ఎమోషనల్ అయ్యింది. ” నేను సినిమాల్లోకి వస్తాను అని అనుకోలేదు. ఇంట్లో, బాత్ రూమ్ లో ర్యాంప్ వాక్ చేస్తూ ఉండేదాన్ని. నా ఫేస్ మీదనే రిజెక్షన్స్ వచ్చాయి. ఒకరు సన్నగా ఉన్నారని రిజెక్ట్ చేస్తే.. ఇంకొందరు లావుగా ఉన్నారని రిజెక్ట్ చేశారు. సన్నగా అవ్వమంటారు.. సన్నగా అయితే రిజెక్ట్ చేస్తారు. రీసెంట్ గా రవితేజ గారి సినిమాలు నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఉన్నాను అందులో సార్ పక్కన లీడ్ లాగా.. ఒక 5 డేస్ లో షూట్ స్టార్ట్ అవ్వాలి. రాత్రికి రాత్రే అమ్మాయి మారిపోయింది” అని చెప్పుకొచ్చింది. ఇక శేఖర్ మాస్టర్ డైరెక్షన్ లో ఫోక్ సాంగ్ చేస్తే దాని కింద కూడా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ లేదు. దీనికి డ్యాన్స్ రాదు.. నువ్వెంటీ ఇలా ఉన్నావ్.. నీ డ్యాన్స్ ఏంటి ఇలా ఉంది అంటూ కామెంట్స్ చేశారు అని చెప్పుకొచ్చింది. ఇక భరత్ సైతం ఇలాంటి కామెంట్స్ పెట్టి డబ్బు సంపాదించి వచ్చిన డబ్బుతో తినే అన్నం ఎలా తిరుగుతుందో తెలియడం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.