Mamitha Baiju: అందం, అభినయం ఉన్న హీరోయిన్స్ కు టాలీవుడ్ లో కొదువేమి లేదు. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు.. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని.. మనసును కొల్లగొట్టిన హీరోయిన్స్ కు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోయిన్ అన్నాకా సినిమాలో పాత్రను బట్టి.. గ్లామర్ ఒలకబోయడం, చిన్నచిన్న బట్టలు వేసుకోవడం సాధారణమే. కానీ, చాలామంది హీరోయిన్స్ బయట కూడా అలాగే కనిపిస్తారు. ఫ్యాషన్ రంగం కాబట్టి.. అలా ఉండడంలో తప్పు కూడా లేదు. కానీ, కొంతమంది మాత్రం బయట ఎంతో హుందాగా ఉంటారు. తమ వ్యక్తిత్వంతో అభిమానులను పడేస్తారు. ఉదాహరణకు అనుష్క.. స్వీటీ ఎప్పుడు బయటకు వచ్చినా ఎంతో పద్దతిగా కనిపిస్తుంది. డ్రెస్, చీర అంతే తప్ప వేరే అవుట్ ఫిట్ లో కనిపించదు. అందుకే స్వీటీ ఫ్యాన్ బేస్ లా ఉంటుంది. సినిమాలు చేయకపోయినా ఆమె సూపర్ స్టార్ గా కొనసాగుతుంది. ఇక స్వీటీ తరువాత అంతలా వ్యక్తిత్వంతో పడేసింది సాయి పల్లవి. ఈ చిన్నది.. సినిమాల్లో కూడా గ్లామర్ షో చేసింది లేదు. ఏ ఈవెంట్ కు వచ్చినా నిండైన చీరకట్టులో అచ్చతెలుగు ఆడపడుచులా వస్తుంది. ఇక వీరి తరువాత.. మలయాళ బ్యూటీ మమితా అలా కనిపించి షాక్ ఇచ్చింది.
మమితా బైజు.. ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి మమితా సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే వస్తుంది. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సాధారణంగా హీరోయిన్స్ .. అది కూడా వేరే భాష నుంచి వచ్చిన హీరోయిన్స్.. తెలుగుకు వచ్చేటప్పుడు తమకు నచ్చిన అవుట్ ఫిట్ లో వస్తారు. కానీ, మమితా మాత్రం ప్రేమలు తెలుగు ప్రమోషన్స్ మొదలైన దగ్గరనుంచి.. సక్సెస్ మీట్ వరకు చీరలతో దర్శనమిచ్చింది. ఇక నిన్న అయితే.. సక్సెస్ మీట్ లో చీర కొంగును వీపు మీదగా కప్పుకొని మాట్లాడిన తీరుకు తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయారు. అంతేనా ఎక్కువ మేకప్ లేకుండా.. ఆభరణాలు లేకుండా.. ఒక సింపుల్ బొట్టుతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. తన అద్భుతమైన వ్యక్తిత్వంతో మలయాళ పిల్ల.. తెలుగు కుర్రకారు పల్స్ పట్టేసింది.. ఇక ఈ సక్సెస్ మీట్ లో రాజమౌళినే స్వయంగా చెప్పుకొచ్చాడు. గిరిజ, సాయిపల్లవి తరువాత మమితా మంచి హీరోయిన్ అవుతుంది అని.. ఇంతకన్నా అమ్మడికి కావాల్సింది ఏముంది. మరి ఈ చిన్నది ముందు ముందు తెలుగులో ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.