Manchu Mohan Babu: భక్తవత్సలం నాయుడు.. ఈ జనరేషన్ లో ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. అదే మోహన్ బాబు అని చెప్పండి.. టక్కున కలెక్షన్ కింగ్ అని చెప్పేస్తారు. సరే ఇంతకు భక్తవత్సలం నాయుడు.. ఎవరు అని అడుగుతారా.. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పేర్లు మార్చుకోవడం చూస్తూనే ఉంటాం. అలా భక్తవత్సలం నాయుడు.. కాస్తా మోహన్ బాబుగా మారారు. అసలు ఎలా ఒక పిటీ టీచర్.. కలెక్షన్…
Ravi Shankar Rathod: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి.
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mukesh Khanna: ఇప్పుడంటే చిన్నపిల్లలు చూడడానికి చాలా వీడియో గేమ్స్, షోస్ వచ్చాయి కానీ, అప్పట్లో చిన్న పిల్లలు చూసిన ఒకే ప్రోగ్రామ్ శక్తిమాన్ . ఈ ప్రోగ్రామ్ కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎదురుచూసేవారు. చాలామంది చిన్నపిల్లలు తమను కాపాడడానికి శక్తిమాన్ వస్తాడని.. గోడల మీద నుంచి దూకేసిన రోజులు కూడా ఉన్నాయి.
Siddharth: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. ఈ పాట ప్రతి RCB పాడుకుంటున్నారు. మరి.. ఒకటా.. ? రెండా.. ? దాదాపు 17 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు RCB కప్పు కొట్టింది. అది పురుషుల జట్టా.. మహిళల జట్టా.. అనేది పక్కన పెడితే బెంగుళూరుకు కప్పు వచ్చింది. అదే మాత్రమే ఇక్కడ ముఖ్యం.
Narne Nithin: మ్యాడ్ సినిమాతో నార్నే నితిన్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఎన్టీఆర్ బామ్మర్దిగా శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతాడు అనుకున్నారు. మరి ఆ సినిమా ఏమైందో తెలియదు కానీ, మ్యాడ్ సినిమాతో మనోడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నితిన్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.
Babloo Prithiveeraj: బబ్లూ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పెళ్లి అనే సినిమాలో విలన్ గా నటించి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ సినిమా తరువాత విలన్ గా, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
Meena: సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.
Hanu-Man: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ మధ్య ఆ యుద్ధం రోడ్డు ఎక్కింది. ఒక హీరో ఫ్యాన్స్.. ఇంకో హీరో ఫ్యాన్స్ పై దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఇక వీరు మారరు అని నెటిజన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Avantika Vandanapu: అవంతిక వందనపు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అయినవారిలో ఈమె కూడా ఒకరు. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హాలీవుడ్ నే షేక్ చేస్తోంది. “మీన్ గర్ల్స్” ఫిల్మ్ లో కరణ్ శెట్టి పాత్రలో నటించి మెప్పించిన అవంతిక కు సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.