Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా కంటిన్యూ కాబోతున్నాడని తెలుస్తోంది. మొన్న హరిహర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హీరోగా కంటిన్యూ అవుతారా అని అడిగితే.. కష్టమే అని చెప్పేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉంటున్నానని.. ఈ టైమ్ లో హీరోగా కొనసాగడం కష్టమే అని తేల్చేశాడు. కాకపోతే నిర్మాతగా కొనసాగుతానన్నాడు. దాంతో ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి చెందారు. అయితే తాజాగా హరిహర సక్సెస్ మీట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సక్సస్ చూస్తుంటే మన కథకు ఎంత ఆదరణ ఉందో అర్థం అవుతోందని.. దీనికి పార్ట్-2 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఆల్రెడీ 20 శాతం షూటింగ్ అయిపోయిందన్నాడు.
Read Also : Pawan Kalyan: వీరమల్లును బాయ్ కట్ చేసుకోమనండి
అంటే దీన్ని బట్టి ఆయన హీరోగా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. ఇంకో నాలుగేళ్ల దాకా హరిహర వీరమల్లు-2 షూటింగ్ ను ఆపలేరు. కాబట్టి ఈ లోపే దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మొన్న ఆ మధ్య పవన్ మాట్లాడుతూ.. వీరమల్లు సినిమాకు ఒకేసారి డేట్లు ఇచ్చేస్తే ఫాస్ట్ గా షూట్ చేశామని.. అది కూడా ఏపీలోనే షూటింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఈజీ అయిందన్నారు. అలాంటి స్క్రిప్టు లు వస్తే చూద్దాం అన్నట్టు హింట్ ఇచ్చేశాడు. వీరమల్లు-2 స్క్రిప్ట్ ను కూడా విదేశాల్లో చేయాల్సిన అవసరం లేదు. లోకల్ గానే చేసేయొచ్చు. కాబట్టి పవన్ కు వీలు కుదిరినప్పుడు ఆయన డేట్లు తీసుకుని దానికి అనుగుణంగా షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన పార్ట్-2ను కూడా మరో రెండేళ్లలో కంటిన్యూ చేస్తారని సమాచారం. ఆల్రెడీ 20 శాతం షూటింగ్ అయిపోయింది. కాబట్టి మిగతాది చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
Read Also : Peddapuram: పెద్దాపురంలో మళ్లీ వ్యభిచార దందా.. పోలీసులే సహకరిస్తున్నారా..?