జూబ్లీహిల్స్ ప్రైమ్ ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆయన నివాసం గురించి ఫాన్స్‌కి కూడా బాగా తెలుసు. అందుకే పుట్టినరోజు లేదా ఇతర వేడుకల సమయంలో ఆయన నివాసం దగ్గరికి వెళ్లి హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఆ బంగ్లా కాస్త పాతబడడంతో గత కొన్ని నెలలుగా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని రెనోవేట్ చేయిస్తున్నారు. తాజాగా రెనోవేషన్ వర్క్ పూర్తయింది. నిన్ననే తిరిగి ఆయన తన సొంత నివాసంలో ఫ్యామిలీతో కలిసి అడుగుపెట్టారు. ఈ రెనోవేషన్ వర్క్‌కి బాగానే ఖర్చయినట్లు తెలుస్తోంది.

Also Read:Rashmika Mandanna: ‘మైసా’ మొదలెడుతున్న రష్మిక

కోట్లు వెచ్చించి నేటి ట్రెండ్‌కి తగ్గినట్లు జూనియర్ ఎన్టీఆర్ రెనోవేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ముందు సంక్రాంతి సమయంలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినా, తర్వాత జూన్ 25వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ చేసిన వార్ 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమైన నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ సినిమా ఒకటి చేయబోతున్నారు.
