ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే సినిమాలేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘నిన్ను కోరి’, ‘మజిలి’ ‘టక్ జగదీశ్’ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. శివ దర్శకత్వం వహించిన ‘టక్ జగదీశ్’ ఈ నెల 10న డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కలయిక లో రూపొందే సినిమాను…
ఒక్కసారి కూడా తెరపై తళుక్కుమనలేదు. అయినా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు అభిమానుల్లో తరిగిపోని చెరిగిపోని అభిమానం నెలకొంది. మోక్షజ్ఞ జన్మించిన 1994 సెప్టెంబర్ 6 మొదలు ఇప్పటి దాకా ఆయన ప్రతి పుట్టినరోజును అభిమానులు వేడుకగా జరుపుకుంటూనే ఉన్నారు. అదుగో ఇప్పుడు వస్తాడు… ఇదుగో వచ్చేస్తున్నాడు… అంటూ చాలా ఏళ్ళుగా మోక్షజ్ఞ తెరంగేట్రం గురించిన విశేషాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటి దాకా మోక్షజ్ఞ ఒక్క సినిమాలోనూ నటించింది లేదు. ఏమైతేనేమి బాలకృష్ణ అభిమానులు మాత్రం…
థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి చాలా కాలమే అవుతోంది.. స్టోర్ రూముల్లోనే దాగిన ఆ బోర్డులు ఏ పెద్ద హీరోనైన రాకపోతాడా.. మా దుమ్ము దులుపుకపోతారా..? అని ఎదురుచూస్తున్నాయి.. థియేటర్లు ఓపెన్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ప్రేక్షకుల హంగామా కనిపించలేదు. 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి వున్నా ప్రేక్షకుల లేక ఇంకా సీట్ల మధ్య సోషల్ డిస్టెన్స్ హే నడుస్తోంది. ఇక ఈ వీకెండ్ వసూళ్లు అయితే థియేటర్ల మైంటైన్ ఖర్చులకు కూడా…
తన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆ నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. అప్పటి నుంచీ ఆయన పుట్టినరోజయిన సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా గురుపూజ్యోత్సం సాగుతోంది. చిత్రసీమలోనూ ఈ సంప్రదాయం కొనసాగేది. తెలుగు సినిమా రంగంలో గురువు అన్న పదం వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే. ఆయన శిష్యప్రశిష్యులు ఈ నాటికీ చిత్రసీమలో దర్శకులుగా వెలుగొందుతూనే ఉన్నారు. తమను సినిమా రంగానికి పరిచయం చేసిన వారిని, ఎక్కువ అవకాశాలు కల్పించిన…
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఎలా అయితే ఆడియన్స్ ను…
సినీ ఆర్టిస్ట్ ఏ.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. టాలీవుడ్ ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన కృష్ణుడు ‘వినాయకుడు’ సినిమాలో హీరోగా నటించాడు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసింది. 7 గంటలు పాటు ఈడీ సుదీర్ఘంగా విచారణ చేసింది. బ్యాంక్ లావాదేవీలుపై ప్రశ్నించిన ఈడీ.. 30 ప్రశ్నలకు రకుల్ నుండి సమాచారం రాబట్టుకొంది. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన రావాలని రకుల్ కు అధికారులు తెలియజేశారు. కెల్విన్ తో సంబందాలు, ఎఫ్ క్లబ్ లో పార్టీపై ఆరా తీశారు. కాగా, రియా చక్రవర్తితో ఫ్రెండ్షిప్ పై ఈడీ అధికారులు విచారణలో అడిగి తెలుసుకున్నారు.…
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ తర్వాత పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ తగ్గగానే ఫస్ట్ తన సినిమా ‘సూపర్ మచ్చి’నే కళ్యాణ్ దేవ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మధ్యలో దీనిని ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలూ వచ్చాయి. అలానే ‘కిన్నెరసాని’ సినిమా కూడా కళ్యాణ్ దేవ్ చేస్తున్నాడు. దీనిని ‘అశ్వద్ధామ’ ఫేమ్…