జాతీత అవార్డు పొందిన తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడట. తమిళంలో ‘పొల్లాదవన్, ఆడుకాలం, విచారణై, వాడా చెన్నై, అసురన్’ వంటి పలు హిట్స్ అందించిన వెట్రిమారన్ వద్ద ఓ ప్రత్యేకమైన కథ ఉందట. ఈ కథ కోసం తెలుగులో నటించే అగ్రహీరోల గురించి ఎదురు చూస్తున్నాడట. దీనిని ఇప్పటికే ఎన్టీఆర్ కి వినిపించాడట. జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందట.…
గాయనిగా, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన చిన్మయి త్వరలోనే నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్ విడుదలై ఆకట్టుకొన్నాయి. అయితే నేడు చిన్మయి పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో…
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్రముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడికి భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని…
తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ కావాల్సి…
సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.…
‘జనతా గ్యారేజ్’ సినిమాతో దర్శకుడు కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద పాత కలెక్షన్స్ ను రిపేర్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులే అవుతున్న.. ఇప్పటివరకు మిగితా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వచ్చే వారం సినిమాకు సంబంధించిన అప్డేట్ను…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈరోజు నందు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైయ్యారు. నందు ఈనెల 20న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఈడీ అధికారుల అనుమతితో నేడు విచారణకు హాజరయ్యాడు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తుంది. ఎక్సైజ్ పోలీసులు ముందు నందు విచారణ జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఎపిక్ అడ్వంచరస్ డ్రామా ‘హరిహర…
అఖిల్ అక్కినేని నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 8 న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు దర్శకనిర్మాతలు. రిలీజ్ డేట్ తో పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ అందులో ఏ గెటప్స్ లో ఉన్న అఖిల్‌ను చూపించారు. ఇప్పటి వరకూ హిట్ లేని అఖిల్ ఈ సారి ఆ కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే అఖిల్…
టొక్యో పారాలింపిక్స్ విజేతలకు టాలీవుడ్ సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లు ఇప్పటికే విజేతల ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ అభినందనలు తెలియచేశారు. ‘ టొక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు నా అభినందనలు, అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో…