సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తేనే ఏమి చెప్పలేని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందజేస్తున్నామని, ఆయనను కాపాడడానికి డాక్టర్స్ అందరు తమ వంతు కృషి చేస్తున్నారని హెల్త్ బులిటిన్ ద్వారా తెలిపారు. కైకాల ఆరోగ్యం బాగుపడాలని, ఆయన మంచిగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.