ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ గురించే చర్చ.. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని భారీ రికార్డులను కొల్లగొట్టే దిశలో పడిగెడుతుంది. థియేటర్లు ఓపెన్ అయ్యాకా విడుదలై మంచి వసూళ్లు రాబట్టి మిగతా సినిమాలకు అఖండ నమ్మకమనే గేట్లను ఎత్తింది. ఇక ఈ సినిమా విజయంపై టాలీవుడ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన పలువురు స్టార్ హీరోలు తమ స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.…
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ వరుసగా రెండు ఎపిసోడ్స్ ప్రసారమయిన తరువాత కొంత గ్యాప్ వచ్చింది. వరుసగా ప్రసారం కావడానికి ఇదేమైనా సీరియలా.. సెలబ్రేషన్.. అంటూ బాలకృష్ణ తన ప్రచార వాక్యాలతో మూడో ఎపిసోడ్ ను అందరినీ అలరిస్తూ ఆరంభించారు. ఈ మూడో ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించడమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. గతంలో రెండు ఎపిసోడ్స్ కంటే మిన్నగా ఈ మూడో ఎపిసోడ్ లో…
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది. తాజాగా పూజ హెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని…
సినీ కార్మికులు, నటులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ పథకం అమలుకై సీనియర్ సినీ నటులు నరేష్ వి. కె. సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి. శ్రీనివాస్ నాయుడుతో శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయ్ కృష్ణ గార్డెన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఫిల్మ్ ఫెడరేషన్ మరియు చిత్రపురి హౌసింగ్ కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. త్వరలో కళాకారుల…
కరోనా సెకండ్ వేవ్ తరువాత చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకొంటుంది.. నిన్న విడుదలైన ‘అఖండ’ చిత్రం థియేటర్లో రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని నమోదు చేసుకొని రికార్డుల కలెక్షన్లు సృష్టిస్తోంది. ఇక డిసెంబర్ చిత్రాలకు శుభారంభం అయినట్లే.. ఈ సినిమా తరువాత అందరి చూపు అల్లు అర్జున్ ‘పుష్ప’ పైనే ఉంది. డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన…
సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం… రింగ రింగా… డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇక వారికి అల్లు అర్జున్ లాంటి స్టార్ తోడైతే ఆగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమా సూపర్ ఐటమ్ ని ప్లాన్ చేశారు. దీనికోసం…
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి ‘భీమ్లా నాయక్’ తహతహలాడుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్, స్టార్ హీరో మూవీ ‘అఖండ’ ఘన విజయం సాధించడం, గ్రాండ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో సరికొత్త జోష్ ను నింపినట్టయ్యింది. దాంతో తమ చిత్రాల ప్రచార హోరును, జోరును మరింతగా విస్తృతంగా, విస్తారంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ లోని నాలుగవ…
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆనతి కాలంలోనే మంచి ట్యాలెంట్ ఉన్న హీరో అని అనిపిచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రంతో కుర్రాళ్లను అభిమానులుగా మార్చేసుకున్న కిరణ్ తాజాగా ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ హీరో ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. తన అన్న రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక తాజాగా సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా…
చిన్నా, పెద్ద వ్యత్యాసం లేకుండా సినిమాలన్నింటికీ టిక్కెట్ రేట్ ఫిక్స్డ్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయానికి లోలోపల రగిలిపోతున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకనిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఎవరూ ధిక్కారాన్ని వ్యక్తం చేయలేదు. ఎవరో కొంతమంది పరిశ్రమ సభ్యులు మాత్రమే నోరు విప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్లో నటుడు సిద్ధార్థ్ చేరాడు. సిద్ధార్థ్ ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటాడు. తన మనసులో మాటను చెప్పడానికి వెనుకాడడు.…
చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రీమేక్ ల హావా నడుస్తోంది.. ఒక భాషలో హిట్ అయినా చిత్రాన్ని భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు హీరోలు.. ఇక రీమేక్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో ఆయన చేసిన రీమేక్ లు ఇంకెవ్వరు చేయలేదు అనడంలో అతిశయోక్తి కాదు. ఐటీవలే దృశ్యం 2 రీమేక్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్న వెంకీ మామ మరో హిట్…