రాధేశ్యామ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభంగా జరుగుతుంది. నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ఈవెంట్ లో అతిరధమహారధులు పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ చేత ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ట్రైలర్ విషయానికొస్తే .. ప్రపంచంలోని అతిరథమహారధులు అందరు కలుసుకోవాలనుకొనే హస్త సాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య.. ప్రేమ పెళ్లి లాంటి ఏమి లేకుండా అమ్మాయిలతో సాఫీగా గడిపే అతని జీవితంలోకి ప్రేరణ వస్తుంది. మొదటి చూపులోనే ప్రేరణను ఇష్టపడిన విక్రమాదిత్య ఆమె ప్రేమ పొందడానికి ఎన్నో పాట్లు పడతాడు. ఇద్దరు కలిసిపోయారనుకొనేలోపు ఒక పెద్ద భయంకరమైన భూకంపం వారిని విడదీస్తుంది. దీంతో విక్రమాదిత్య ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? చివరికి ప్రేరణ ప్రేమను పొందగలిగాడా..? ప్రేమ కోసం ఇద్దరు మరణించారా..? అనేది మిగిలిన కథగా తెలుస్తోంది. లవర్ బాయ్ గా ప్రభాస్ డార్లింగ్ సినిమాను గుర్తుచేశాడు.
ఇక రాధే శ్యామ్ గా ప్రభాస్ – పూజ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక ప్రభాస్ ని ఎలివేట్ చేసే పరమహంస పాత్రలో కృష్ణంరాజు అద్బుతంగా కనిపించారు. ఇక ట్రైలర్ లో విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా ..? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీయగలదా ..? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా..? అనే డైలాగులు సినిమాలో ఉన్న లోతైన కథను, రాధేశ్యామ్ ప్రేమ గాఢతను తెలియజేస్తున్నాయి. ఇక ట్రైలర్ కి థమన్ ఇచ్చిన మ్యూజిక్ అల్టిమేట్. ఇక ముందు చెప్పుకున్నట్లుగానే విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ చూశాక ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈ సినిమా ప్రభాస్ కి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.