‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్నా విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నా ఈ ప్రోగ్రామ్ కో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ఈవెంట్ లో నవీన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఒక స్టార్ హీరో ఈవెంట్ లో ఇంకో హీరోకి ఏవీ వెయ్యడం ఇదే మొదటిసారి. ఇక జాతి రత్నాలు సాంగ్ తో నవీన్ స్టేజిపై దుమ్ము దులిపేశాడు. ఇక తాని మాటల చాతుర్యంతో అందరి మనసులను గెలుచుకున్నాడు. తనదైన రీతిలో అల్లరి చేశాడు. ప్రభాస్ అన్నది బాడీ కాదు బాక్స్ఆఫీస్ అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ని అలరించాడు.