ప్రముఖ హీరో అడవిశేష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ ‘డెకాయిట్’ షూటింగ్ స్పాట్లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రమాదవశాత్తు క్రింద పడి గాయాలపాలయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం, గాయాలు కాస్త తీవ్రంగానే ఉన్నప్పటికీ, వారు ధైర్యంగా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ‘డెకాయిట్’ చిత్రం హై-ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రమాదం ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో జరిగినట్లు సమాచారం.…
తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహినూర్ గురించి ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే క్రిష్ చెప్పిన వెంటనే సినిమా చేశాం. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో చాలా నలిగిపోయాం. ఇంత నలిగిన తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డులు చేస్తుందంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తుందన్నా నేను చెప్పలేను. నేను ఈ రోజుకి చెబుతున్నాను, సినిమా కోసం మా బెస్ట్…
పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందిన సంగతి తెలిసింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత నటించిన సినిమా ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. వాస్తవానికి ఏ హీరో అయినా తాను నటించిన ప్రెస్ మీట్ లేదా ప్రమోషన్స్‌కి హాజరు కావడం సర్వసాధారణం, కానీ పవన్ గత కొద్ది…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న (జులై 24, 2025) విడుదల కానున్న ఈ సినిమా పట్ల అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు మొదటి రెండు వారాల పాటు టికెట్ రేట్ల పెంపు కోరగా, ప్రభుత్వం మొదటి పది రోజులకు మాత్రమే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.…
యూట్యూబర్ పూల చొక్క నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా..రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్.
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం మరవక ముందే అలనాటి నటి సరోజ మరణం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. Also Read:Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో…
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున కన్నుముసారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేసారు. చిరంజీవి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, ఆర్ నారాయణ మూర్తి, రాజీవ్ కనకాల, వందేమాతరం శ్రీనివాస్, తమ్మరెడ్డి భరద్వాజ, నిర్మాత బండ్ల గణేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, రాజేంద్ర…
Anasuya : హాట్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తాను దారుణంగా మోసపోయానని చెప్పింది అనసూయ. ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్స్ అని తెలిసిందే. ఏదైనా సరే ముందే డబ్బులు చెల్లించి వస్తువు కోసం వెయిట్ చేస్తే.. చివరకు అది రావట్లేదు. ఇలాంటి ఘటనలు చాలానే…
స్టార్ హీరో ప్రభాస్ గురించి ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారిన యూట్యూబర్ రణవీర్ అల్లా బాడియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణవీర్, “కొంతమందిని చూస్తే వీరు దేవుడి బిడ్డలు అనిపిస్తుంది. అలా నాకు ప్రభాస్‌ను చూస్తే అనిపిస్తుంది,” అని చెప్పుకొచ్చారు. నిజానికి, ప్రభాస్ చాలా తక్కువ మందితో మాత్రమే సంభాషిస్తూ ఉంటాడు. స్వభావరీత్యా చాలా సిగ్గరి అయిన ప్రభాస్ గురించి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే కొన్ని విషయాలు తెలుసు.…