Kalki 2 Update: ‘కల్కి 2898 AD’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2024 జూన్ నెలలో విడుదలైన ‘కల్కి 2898 AD’ లో ప్రభాస్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సై-ఫై మిథాలజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ పవర్ ను విశ్వవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పింది. ఈ భారీ విజయంతో సినిమా అభిమానులందరి దృష్టి ఇప్పుడు ‘కల్కి 2’ పై పడింది.
తాజగా ఓ పోడ్కాస్ట్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 2025 చివర్లో ‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నట్లు ఆయన అన్నారు. అయితే, ఇందులో చాలా అంశాలు కలసి రావాల్సి ఉంది. ముఖ్యంగా సినిమాలోని నటులందరి షెడ్యూల్స్ కుదరాలి. అలాగే ఇప్పటికే ప్రీ-విజువలైజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు చాలా పెద్దవి కాబట్టి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేను. ఆర్టిస్టులందరూ అందరూ బిజీగా ఉన్నారు అని అన్నాడు.
ఖగోళ అద్భుతం.. ఆ రోజే Blood Moon దర్శనం!
అలాగే షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ మరింత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మరో 2 లేదా 3 సంవత్సరాల్లో సినిమా పూర్తవుతుందని అనుకుంటున్నానని భారీ బాంబ్ పేల్చాడు. అప్పటివరకు అభిమానులు ఓపిక పట్టాలి అంటూ నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. ‘కల్కి 2898 AD’లో ప్రభాస్, దీపికా పదుకోనతో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ లు కీలక పాత్రల్లో కనిపించారు.