Chiranjeevi : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేసి విషెస్ తెలిపారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ లోకి ఆ క్రేజీ బ్యూటీ.. ఇక రచ్చే
ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ కోరారు చిరంజీవి. ఈ సందర్భంగా పవన్ కల్యాన్ తో గతంలో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇందులో ఇద్దరి అనుబంధం చూడముచ్చటగా ఉందనే చెప్పుకోవాలి. చిరంజీవితో పాటు మెగా హీరోలు, సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు స్పెషల్ విషెస్ చెబుతున్నారు.
Read Also : Anushka : అనుష్క కోరిక నెరవేరుతుందా..?
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు… pic.twitter.com/13gaXFpWsG— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2025