OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పవన్ కల్యాణ్ ఏమీ మాట్లాడకపోయినా ఈ మూవీ గురించే పెద్ద రచ్చ జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్ కల్యాణ్ దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు చాలా టైట్ షెడ్యూల్ ఉంది. కాబట్టి రాజకీయాలను వదిలిపెట్టి సినిమాలకు పరిమితం అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు.
Read Also : OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్ దూరం..?
పవన్ రాకపోయినా ట్రైలర్ తోనే ప్రమోషన్ బ్లాస్ట్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందంట. ఈ ట్రైలర్ లో పవన్ మేనరిజం హైలెట్ అయ్యేలా చూస్తున్నట్టు తెలిసిందే. పవన్ మేనరిజానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రెండు స్టిల్స్ రిలీజ్ కాగా అందులో పవన్ స్టైల్ కే సోషల్ మీడియా ఊగిపోయింది. అలాంటిది పవన్ కాస్త మేనరిజంను చూపిస్తే ఇంక అరాచకమే అంటున్నారు మూవీ టీమ్. అందుకే పవన్ రాకపోయినా ట్రైలర్ తోనే అంచనాలు పెంచేయాలని చూస్తున్నారంట. ఓజీపై ఎలాగూ భారీ క్రేజ్ ఉండనే ఉంది. దాన్ని ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుందని ఆలోచిస్తున్నారు మూవీ టీమ్.
Read Also : Mirai : మిరాయ్ లో మహేశ్ బాబు.. తేజ సజ్జా షాకింగ్ కామెంట్స్