Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ షో స్టార్ట్ కాబోతోంది. బిగ్ బాస్ కు తెలుగులో ఏ స్థాయి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సారి కామన్ పర్సన్లను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. దీని కోసం అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కూడా నిర్వహించేస్తున్నారు. ఈ సారి షోలోకి సెలబ్రిటీలు బాగానే వస్తున్నారంట. లిస్టు కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి రీతూ చౌదరి కూడా రాబోతోందంట. ఈ బ్యూటీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ మధ్య ఏపీలో రూ.750 కోట్ల స్కామ్ లో ఆమె పేరు మార్మోగిపోయింది.
Read Also : Coolie : కూలీ రిజల్ట్ పై లోకేష్ స్పందన.. ఇలా అన్నాడేంటి..
ఆమె పేరు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. వాటితో తనకు సంబంధం లేదని ఆమె ఎంత చెప్పినా కాంట్రవర్సీ మాత్రం ఆగలేదు. ఇక దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె పేరు రచ్చకు దారి తీసింది. ఇలాంటి కాంట్రవర్సీలతో ఉన్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి వస్తే రచ్చ మామూలుగా ఉండదు. పైగా ఆమె సోషల్ మీడియాలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తుందో మనకు తెలిసిందే. ఆమె అందాలకు ఓ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. మరి ఈ బ్యూటీ షోలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. ఆమె మాత్రం తన మీద ఉన్న నెగెటివిటీని కొంచెం తగ్గించుకుందామని చూస్తోందంట.
Read Also : Anushka : అనుష్క కోరిక నెరవేరుతుందా..?