“నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్…
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా…
చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకపై శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఈ వేడుకకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చాలా బాగుందని, ట్రైలర్ లో చరణ్ సీన్స్ చూసి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అనుకొనేలోపు తారక్ ఎలివేషన్స్.. ఒక్క ట్రైలర్ లో ఎవరిని చూడాలో అర్ధం కాలేదని చెప్పుకొచ్చాడు.…
ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅథిధులుగా విచ్చేశారు. ఈ వేడుకలో శివ కార్తికేయన్, ఎన్టీఆర్…
‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ముఖంపై మొటిమలతో, తక్కువ మేకప్ తో కనిపించిన ఈ భామను అప్పట్లో ట్రోల్ల్స్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ అవేమి పట్టించుకోకుండా తన పంథాలోనే కొనసాగుతూ వచ్చిన సాయి పల్లవి తన న్యాచురల్ అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకొంది. ఇక స్కిన్ షో చేయను అని నిర్మోహమాటంగా చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెడుతూ ఎంతమంది తారలకు ఆదర్శంగా నిలుస్తోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ , పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్…
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గించడంపై నాని తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో ఐక్యత లేదు అని , వకీల్ సాబ్ సినిమా అప్పుడు మొదలైన ఈ సమస్యకు అప్పుడే పరిష్కారం వెతకాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు పెదవి…
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో ఆరో ఎపిసోడ్ భలే సందడి చేసిందనే చెప్పాలి. ‘అఖండ’ విజయం సాధించిన ఉత్సాహం ఓ వైపు… ‘పుష్ప’ విజయసువాసనలు మరో వైపు పరిమళిస్తూండగా సాగిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రక్తి కట్టించింది. ఈ కార్యక్రమంలో ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ముందుగా హాజరయ్యారు. తరువాత నాయిక రష్మిక వచ్చేసింది. చివరలో అల్లు అర్జున్ రాగానే సందడి మరింత పెరిగింది. 47 నిమిషాల పాటు సాగిన…
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ ఉంచి కొద్దిగా గ్యాప్ దొరికినా అమ్మడు టూర్స్ చెక్కేస్తోంది. తన స్నేహితురాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా సామ్ ‘యశోద’ షూటింగ్ ని కంప్లీట్ చేసి గోవా టూర్ కి చెక్కేసింది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి తో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను సామ్ ఎప్పటికప్పుడు అభిమానులతో…