ట్రైలర్ టాక్: ‘రౌడీ బాయ్స్’ వలన చిక్కులో పడ్డ అనుపమ జీవితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూస్తుంటే యూత్ ఎంటర్ టైన్మెంట్ లా కనిపిస్తోంది.
ట్రైలర్ విహాయానికొస్తే.. కాలేజ్ అంటేనే బోర్ గా ఫీలయ్యే ఒక కుర్రాడు.. అల్లరి చిల్లరగా తిరుగుతూ, తండ్రి చేత తిట్లు తింటూ కాలేజ్ కి వెళ్తాడు. అక్కడ కాలేజ్ ఫెస్ట్ లో తన ఇమేజ్ ని పెంచుకోవడానికి మెడికల్ కాలేజ్ అమ్మాయిని తీసుకురావాలనుకుంటాడు. ఆ క్రమంలోనే డాక్టర్ చదువుతున్న కావ్య(అనుపమ) ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె తనకన్నా పెద్దది అని తెలిసినా ఫెస్ట్ కి తీసుకెళ్లి మెడికల్ కాలేజ్ అబ్బాయిల దృష్టిలో పడతాడు. కావ్యకి దూరముగా ఉండమని మెడికల్ కాలేజ్ గ్యాంగ్.. హీరో కి వార్నింగ్ ఇవ్వడం.. దీంతో ఇరు వర్గాల మధ్య వార్ నడవడం .. ఇక వారిద్దరి మధ్య కావ్య బలవ్వడం చూపించారు. మరి హీరో తన పద్దతి మార్చుకొని కావ్యకు దగ్గరయ్యాడా..? అస్సలు రౌడీ బాయ్స్ వలన కావ్య జీవితం ఏమైంది..? అనేది ట్విస్ట్ గా చూపించారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. బిగ్గెస్ట్ కాలేజ్ సినిమాగా తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ ట్రైలర్ కి హైలైట్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందుకుతుందో చూడాలి.
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!