టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి గతేడాది కలిసి రాలేదన్న విషయం తెలిసిందే. వరుస పరాజయాలు శర్వా ను పలకరించాయి. జాను, మహా సముద్రం చిత్రాలు శర్వా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా నిలిచాయి. ఇక ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తూ శర్వా కొత్త సినిమాలతో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ షూటింగ్ ని పూర్తి చేసుకోగా, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం సెట్స్ మీద ఉన్నది. చిత్ర లహరి చిత్రంతో సాయి…
‘మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు’ వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.…
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్…
టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి, తెలుగువారికి చేరువైన ఉత్తరాది భామ సోనాలీ బింద్రే. స్టైల్ ఐకాన్ గా పేరొందిన సోనాలీ బింద్రే పలు యాడ్స్ లో నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించింది. వెండితెరపై సోనాలీ నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైనా మురిపించింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించి అలరించారు. క్యాన్సర్ ను ధైర్యంగా జయించి పలువురికి స్ఫూర్తి కలిగించారు సోనాలీ బింద్రే! సోనాలీ బింద్రే మహారాష్ట్ర…
సమాజంలోని సంచలన సంఘటనలను సినిమాలుగా తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ఆ తరహా చిత్రాల ద్వారా సమాజానికి వర్మ ఏం సందేశం ఇస్తున్నారు అనే దానికంటే… తన పాపులారిటీని పెంచుకోవడానికి ఆ సంఘటనలను వాడుకుంటున్నారు అనేది వాస్తవం. శంషాబాద్ సమీపాన 2019లో జరిగిన దిశ హత్య, ఆపైన జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో వర్మ ‘ఆశ: ఎన్ కౌంటర్’ పేరుతో ఓ సినిమా తీశారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా…
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దానికి ఇప్పుడు ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్ తోడైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ క్యారెక్టర్ ను తెలియచేస్తూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయడం విశేషం. ‘రామం రాఘవం… రణధీరం రాజసం’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాశ్,…
26/11 ముంబై దాడులలో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఎ ప్లస్ యస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ‘మేజర్’ చిత్రం ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే… ఈ యేడాది చివరి రోజున ‘మేజర్’ సినిమా హిందీ వర్షన్ డబ్బింగ్ ప్రారంభించాడు హీరో అడివి శేష్. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న…
గీత గోవిందం చిత్రంతో పాపులర్ జంటగా మారిపోయారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. ఈ సినిమాతో రష్మిక టాలీవుడ్ కి పరిచయం కాగా, విజయ్ కి క్లాస్ హీరోగా పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. అప్పటినుంచే ఈ జంట మధ్య ప్రేమ చిగురించిందని పుకార్లు గుప్పుమంటున్నాయి. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ లవ్…
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఆరోగ్యం బాగోలేదని. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్నారని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజమో, కాదో తెలియకుండానే నెటిజన్లు ఇళయరాజా కోలుకోవాలని కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు ఇళయరాజా.. ఎంతో చక్కగా తనదైన శైలిలో ఒక మధురమైన పాటను ఆలపిస్తూ అందరికి నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలుపుతూ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం…
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దీనికి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేస్తూ ”రాయ్‌లక్ష్మీ కెరీర్లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు. స్పోర్ట్స్‌ను…