పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆమధ్య స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. పవన్ ఆత్మగా త్రివిక్రమ్ ని చెప్తూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. జల్సా చిత్రంతో స్టార్ట్ అయినా వీరి స్నేహబంధం ఇప్పటికి కొనసాగుతోంది. ఇక కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ మాట తప్ప వేరొకరి మాట వినడు పవన్ అని అందరికి తెలిసిందే. పవన్ రీ ఎంట్రీ విషయంలో త్రివిక్రమ్ కీలక బాధ్యత వహించాడు. రీ ఎంట్రీ.. పింక్ రీమేక్ చేస్తే బావుంటుందని…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలివుడ్ వర్గాలు. ఇప్పటివరకు విజయ్ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడిన..అలాంటి ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అంతా అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేయించినా .. దాని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశాడు విజయ్.. దీంతో విజయ్ కి రాజకీయాలపై ఆసక్తిలేదని…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహిస్తుండడం విశేషం.…
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని పులకింప చేశాయి. ఏయన్నార్ హిట్ పెయిర్ గా వాణిశ్రీ జేజేలు అందుకున్నారు. వారిద్దరూ జోడీగా నటించిన ‘ఆలుమగలు’ చిత్రం కూడా తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 1977 మార్చి 17న విడుదలయి, విజయఢంకా మోగించింది. అక్కినేనితో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘ఆలుమగలు’ సినిమాను తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ‘ఆలుమగలు’ కథ ఏమిటంటే-…
అభిమానం గుండెల్లో నుంచి వస్తుంది.. ఒక్కసారి ఒకరిని అభిమానించమంటే వదలడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగువారు ఒకరిని అభిమానించారంటే .. చచ్చిపోయేవరకు వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అయితే హీరోకు ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. కానీ ఒక డైరెక్టర్ కి ఫ్యాన్స్ ఉండడం చాలా అరుదు.. అది ఇంతలా అభిమానించే ఒక అభిమాని ఉండడం నిజంగా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అభిమానిని సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో పాటు మార్చ్ 11 న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా రికార్డుల కలెక్షన్స్…
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు అతని కుమారుడు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై ఫైనాన్షియర్ శ్రవణ్ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. గోపించంద్ మలినేనితో శ్రీనివాస్ సినిమా ఉంటుందని చెప్పి తనవద్ద రూ.85 లక్షలు తీసుకున్నారని అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని శ్రవణ్ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణ హాని కూడా ఉందని తెలిపాడు. ఇక ఈ కేసుఫై బెల్లంకొండ…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలను బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ప్రస్తుతం మాలీవుడ్ ని షేక్ చేస్తోంది. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి పేరు ఉంది. మహానటి, కనులు కనులను దోచాయంటే, కురుప్ లాంటి చిత్రాలతో తెలుగు అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. అంతేకాకుండా అతడు నటించిన చిత్రాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(ఎఫ్‌ఈయూకే) నిర్ణయించాలని చూడడం…
ప్రేమ ఖైదీ చిత్రంలో మాలా శ్రీ నటనను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోడు.. అందం, అభినయం కలగలిపిన ముద్దుగుమ్మ తెలుగులో సాహసవీరుడు సాగరకన్య, భలే మామయ్య సినిమాలలో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ ని వివాహం చేసుకొని కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్, యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగింది. ఇక ఎన్నో ఏళ్ళ తరువాత తెలుగు బుల్లితెరపై ఆమె సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఇటీవల ఆమె…