Ghani: తగ్గింపు కాదు.. అసలు ధరలకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ చిత్రం ఈ నెల 8న జనం ముందుకు రాబోతోంది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించినట్టుగా చిత్ర నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ధు చెబుతున్నారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ. 200 ప్లస్ జీఎస్టీ ఉంటుందని, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీ తో కలిపి టిక్కెట్ ధర రూ. 150 ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఇది సినిమా రేట్లను తగ్గించడం ఎంతమాత్రం కాదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ టిక్కెట్లను అమ్ముతున్నారు. ఆ మధ్య ‘దిల్’ రాజు వంటి ఎగ్జిబిటర్స్ కొందరు పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాన్ని కోరారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మీడియం బడ్జెట్ సినిమాల టిక్కెట్ రేట్లనూ ఎగ్జిబిటర్లు పెంచేశారు. వాటి కలెక్షన్ల మీద టిక్కెట్ రేట్ల పెంపు ప్రభావం పడటంతో తగ్గించుకున్నారు.
ఇక ‘ట్రిపుల్ ఆర్’ వంటి భారీ బడ్జెట్ సినిమా విషయంలో ఎగ్జిబిటర్లు అంతకు మించి అన్నట్టుగా స్పెషల్ జీవోతో ప్రేక్షకుల నుండి డబ్బులు దండుకున్నారు. అయితే అలాంటివేవి లేకుండా రెగ్యులర్ గా సినిమా టిక్కెట్ రేట్ ఎంత ఉంటుందో అంతకే ‘గని’ సినిమాను తెలంగాణలో ప్రదర్శించబోతున్నారు. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’కు టిక్కెట్ రేట్లను భారీగా పెంచడంతో సామాన్య జనం థియేటర్ కు వెళ్ళడానికి భయపడుతున్నారు. దాంతో ఆ తర్వాత వారం జనం ముందుకు వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాన్ని ‘రీజనబుల్ రేట్ల’కే ప్రదర్శిస్తున్నామంటూ ఆ సినిమా నిర్మాతలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read
- Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
- Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
- Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
- NBK 111 : బాలయ్య - గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
తాజావార్తలు
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!