Akira Nandan: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్. ఏఐ.. ఏ ముహూర్తన ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
Killer Soup: ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు, సిరీస్ లు వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు రియలిస్టిక్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంత మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కుటుంబాన్ని, పండగలను, పిల్లలను అన్ని మర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆరాటపడుతున్నాడు. ఒక స్టార్ హీరోగా ఏసీ కార్లలో తిరుగుతూ.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించొచ్చు.
Prasanth Varma: హనుమాన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి బరిలో అసలు హనుమాన్ ఉండదేమో అనుకున్నారు. చాలామంది ఈ సినిమాను ఆపడానికి ప్రయత్నాలు కూడా చేశారు.
Rakesh Master:సాధారణంగా ఒక మనిషి చనిపోతే.. కొంతకాలం మాత్రమే గుర్తుంటారు. కానీ, ఒక నటుడు చనిపోతే.. వారు చనిపోయినా కూడా.. వారు నటించిన సినిమాల ద్వారా నిరంతరం జీవిస్తూనే ఉంటారు. ఎంతోమంది నటులు భౌతికంగా లేకపోయినా.. వారు నటించిన సినిమాలతో జీవించే ఉంటారు. ఒక నటుడును గుర్తుంచుకోవడానికి 100 సినిమాలు చేయనవసరం లేదు.. ఒకే ఒక్క హిట్ సినిమా చేసినా చాలు.
Mahesh Babu: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. వెండితెరపై కనిపించే వారందరూ కేవలం నటిస్తారు మాత్రమే. బయట ఎవరికి ఎవరు బంధువులు కారు.. బంధాలు, అనుబంధాలు ఉండవు. అది వారి వృత్తి మాత్రమే. ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించినవారే.. ఇంకో సినిమాలో అన్నాచెల్లెళ్లలా కనిపిస్తారు. అది కేవలం పాత్రలు మాత్రమే.
Yatra 2:ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో యాత్ర 2 ఒకటి. రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు.
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ నా సామి రంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Vijay Devarakonda: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ జంటగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. ముంబై క్యాడర్ కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సివిల్స్కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సామ్.. గతేడాది నుంచి సినిమాలకు బ్రేక్ చెప్పి.. రెస్ట్ తీసుకొంటుంది. ప్రకృతిలో మమేకం అయ్యి.. తన వ్యాధితో పోరాడుతుంది.