RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి అయ్యాక .. శంకర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, గౌతమ్ తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆ మూవీ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్ళింది. ఇదే సమయంలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాల్సిన విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ దగ్గరకి వచ్చింది. అలా RC 16 అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నారు.
బుచ్చిబాబు స్టార్ క్యాస్టింగ్ తోనే సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు. ముఖ్యంగా చరణ్ సరసన హీరోయిన్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట జాన్వీ కపూర్ అన్నారు. ఆ తరువాత మృణాల్ మాట్లాడుకున్నారు. అందులో కూడా నిజం లేదని తేలింది. ఇక కొత్తగా సమంత పేరు వినిపిస్తుంది.ఇప్పటికే బుచ్చిబాబు సామ్ ను సంప్రదించడం, ఆమె ఓకే అనడం, ఫోటోషూట్ కూడా మొదలుపెట్టారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. ఇది కూడా నిజం కాదని సమాచారం. సమంత దగ్గరికి ఎవరు వెళ్లలేదని తెలుస్తోంది. సామ్ కాకుండా వేరే ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారట. వారికి ఫోటోషూట్ చేయడం జరిగిందని, డైరెక్టర్ కు నచ్చకపోవడంతో వాళ్ళు కూడా క్యాన్సిల్ అని తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ ఎదురుచూస్తుందో చూడాలంటే.. కొన్నిరోజులు ఆగాల్సిందే.