Mrunal Thakur: ఒకప్పుడు హీరోయిన్స్ అంటే.. హీరోతో సమానంగా పాత్ర ఉండేది. సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యంగా ఉండేది. జనరేషన్ మారేకొద్దీ హీరోయిన్ పాత్ర తగ్గిపోతూ వచ్చింది. ఆ తరువాత హీరోయిన్స్ అవసరానికి గ్లామర్ ఒలకబోస్తూనే.. ముఖ్యమైన పాత్రల్లో కూడా కనిపించేవారు. ఇక ఆ తరువాతి జనరేషన్ లో హీరోయిన్ అంటే డ్యాన్స్ లకు, రొమాన్స్ కు అన్నంతలా మార్చేశారు. అప్పటి హీరోయిన్స్ కూడా గ్లామర్ ఒలకబోసేవారు కానీ, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకోనేవారు. ఇక ఇప్పటి హీరోయిన్స్ కేవలం గ్లామర్ మాత్రమే చూపిస్తున్నారు. అయితే అందరి గురించి చెప్పలేం కానీ, కొంతమంది మాత్రం పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలు చేయం అని ముఖం మీదనే చెప్పేస్తున్నారు. నిత్యా మీనన్, సాయి పల్లవి ఇలా.. పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప గ్లామర్ ఒలకబోయడానికి కూడా ఇష్టపడరు. ఇక పాత్ర ఏదైనా.. అందులో పరకాయ ప్రవేశం చేసే హీరోయిన్లు కూడా లేకపోలేదు. అయితే ఒక సినిమా హిట్ అవ్వగానే.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాకా.. ప్రతి హీరోయిన్ కోరిక ప్రాధాన్యత ఉండే పాత్రలే చేయాలి అని. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూస్ లో చెప్పేసారు కూడా. కానీ, కొన్నిసార్లు ఆ మాటను వారే తప్పారు.
ఉదాహరణకు రష్మిక.. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ దాని తరువాత గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది. అందులో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఆ సమయంలోనే ఆమె ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇకనుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తప్ప సాంగ్స్ కు పరిమితమయ్యే సినిమాలు చేయను అని చెప్పింది. అప్పుడు ఆమె మాటలు చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఇక అలా చెప్పిందో లేదో.. వెంటనే మహేష్ సరసం సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రాధాన్యత లేని పాత్ర చేసి ట్రోల్ కు గురైంది. ఇక ఇప్పుడు రష్మికలానే మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇదే స్టేట్మెంట్ ను పాస్ చేసింది. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ భామ కూడా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తప్ప సాంగ్స్ కు పరిమితమయ్యే సినిమాలు చేయను చెప్పుకొచ్చింది. ఇది మంచి నిర్ణయమే.. కానీ, రష్మిక లా మాత్రం చేయకు అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు రష్మిక కూడా ఇదే చెప్పింది.. నువ్వేం చేస్తావో చూడాలి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి మృణాల్ ఏం చేస్తుందో చూడాలి.