Gorre Puranam: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుహాస్. మొదటి నుంచి కూడా మంచి మంచి కథలు ఎంచుకొని విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గొర్రె పురాణం ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫోకల్ వెంచర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ అంతా ఎంతో ఆసక్తికరంగా ఉంది. చంచల్ గూడలో ఉన్న ఏ1 ఏసుకు కోర్టు బెయిల్ నిరాకరించింది అంటూ బ్రేకింగ్ న్యూస్ చెప్తున్న యాంకర్ డైలాగ్ తో ఈ వీడియో మొదలయ్యింది. చంచల్ గూడ జైలు, మీడియా, జనాలు, పోలీసులు.. ఇలా వీరందరిని చూపిస్తూ గొర్రె పురాణం టైటిల్ ను చూపించారు. ఇక చివర్లో చంచల్ గూడ జైలు నుంచి ఒక గొర్రె బయటకు రావడం చూపించారు.
ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే.. టైటిల్ కార్డు పడిన తరువాత.. ఈ సినిమా నిబ్బా, నిబ్బిలకు కాదు అని హెచ్చరిక జారీ చేయడం మరో ఎత్తు అని చెప్పాలి. అసలు ఎవరీ ఏసు.. ? గొర్రెను జైలులోకి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఏసు అంటే గొర్రేనా? ఇందులో సుహాస్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ ను బట్టి సుహాస్ మరో హిట్ కొట్టేలానే ఉన్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.