The Family Star: ఏమైనా.. విజయ్- రష్మిక జోడీకున్న అందం విజయ్-మృణాల్ కు రాలేదురా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Family Star: ది విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. విజయ్ కెరీర్ లో గీతగోవిందం లాంటి హిట్ ను అందించిన పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అదే సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నందనందనా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. గీతగోవిందం లో ఇంకేం ఇంకేం కావాలే అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపిన సిద్ .. మరోసారి నందనందనా తో ఆ మ్యాజిక్ ను క్రియేట్ చేసేటట్లే ఉన్నాడు. ఇక విజయ్- మృణాల్ జంట ఫ్రెష్ గా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ లా విజయ్ కనిపించగా.. అతడిని ఇష్టపడే అమ్మాయిగా మృణాల్ కనిపించింది. తనపై ఉన్న ప్రేమను చెప్పి చెప్పనట్టుగా ఒక్క మాటలో చెప్పడంతో విజయ్ తన మనసులోని మనోభవాలను ఇలా సాంగ్ రూపంలో బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ హుక్ స్టెప్ అదిరిపోయింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకొంటుంది. మృణాల్ ఎప్పటిలానే అందంగా ఉంది. కానీ, గీతగోవిందం మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. విజయ్- మృణాల్ జంట బావుంది కానీ, విజయ్- రష్మిక జోడికి మాత్రం మ్యాచ్ అవ్వలేదని అంటున్నారు. మరి గీతగోవిందం హిట్ ను ది ఫ్యామిలీ స్టార్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!