నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో టాలీవుడ్ గేట్లను ఎత్తేసాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని, బాలకృష్ణ స్టామినా చూపించారని తెలుపుతున్నారు. స్టార్ హీరోలు సైతం బాలయ్యబాబును పోగొడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా వీక్షించిన బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి తనదైన రీతిలో తన స్పందన తెలియజేసింది. “అఖండ సినిమా చూశాను.. చాలా అద్భుతంగా ఉంది.. అప్పుడు…
సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనే వాటిని గురించి తెలియచెప్పిన సినిమా ‘రిపబ్లిక్’. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, జీ 5 ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూస్తున్నారు. ”రిపబ్లిక్’ ఓ మూవీ…
‘పెంకిపెళ్ళాం’ చిత్రం గురించి చెప్పుకోవాలంటే, నటరత్న యన్.టి.రామారావు, దర్శకులు కమలాకర కామేశ్వరరావు మైత్రీబంధం గురించి తప్పకుండా ముచ్చటించుకోవడానికి ఈ సినిమా ఆస్కారమిస్తుంది. కామేశ్వరరావు ముక్కుసూటి మనిషి. ఏది అనిపిస్తే అదే చెప్పేవారు తప్ప ముఖస్తుతి ఆయన నచ్చదు. అలాంటి కామేశ్వరరావు రాసిన రివ్యూ నచ్చి మరీ మదరాసు పిలిపించుకున్నారు హెచ్.ఎమ్.రెడ్డి. తరువాత కామేశ్వరరావు , కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా ‘పాతాళభైరవి’కి పనిచేశారు. ఆ సినిమా స్క్రీన్ ప్లేలోనూ కమలాకర పాత్ర ఉంది. అది గమనించిన…
ప్రపంచవ్యాప్తంగా సినీఅభిమానులు అందరు ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రంతి కానుకగా జనవరి 7 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ప్రమోషన్స్ వేగవంతం చేసేశాడు . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోతను మోగిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ‘ఆర్ఆర్ఆర్’ బృందమే అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్…
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో చాలా రేర్. ఓ కథ అనుకుని, అన్ని వర్గాలను అలరించే అంశాలను ఏదో రకంగా అందులో మిళితం చేసి, వండి వార్చే సినిమాలే మనకు ఎక్కువ. అయితే శనివారం విడుదలైన ‘స్కైలాబ్’ మూవీ అందుకు భిన్నమైంది. మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోహీరోయిన్ల లవ్ మేకింగ్ సీన్స్, సాంగ్స్, యాక్షన్, పిచ్చి కామెడీ, వెకిలి చేష్టలు ఇందులో కనిపించవు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో…
వివాదాల దర్శకుడు వర్మను ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారింది అరియానా గ్లోరీ. ఇక స్టార్ డమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా ‘అనుభవించు రాజా’ చిత్రంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. ఈ సందర్భంగా ఆమె, హీరో రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం…
టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. చిరు ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టగా.. వెంకటేష్ రెండు.. బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆ లెక్కన చూసుకుంటే కింగ్ నాగార్జున కొద్దిగా వెనకపడినట్లు కనిపిస్తుంది. పండగ సమయంలోను నాగ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా నిరాశపడ్డారు. అయితే నేను కూడా తగ్గేదేలే అంటూ బంగార్రాజు తో ఏంటి ఇచ్చేశాడు కింగ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం నాగార్జున, రమ్య కృష్ణ…
విభిన్న కథాంశాలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. వసాగా విజయాలను అందుకుంటున్న ఈ హీరో మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం…
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం బాగా పెరిగింది. అలా రూపొందిన చిత్రమే ఈ ‘మంచిరోజులు వచ్చాయి’. యువి క్రియేషన్స్ భాగస్వామి కావడం, దర్శకుడు మారుతి దర్శకత్వం వహించటంతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగి థియేటర్ రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ తరహా చిత్రాలకు సరిగ్గా సరిపోయే హీరో సంతోష్ శోభన్. ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయిన తర్వాత మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. మరి దీపావళి…
‘వలయం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య తో ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, ”డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండి…