గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రూపొందిన ఈ సినిమా టీజర్ ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ ‘చరిత చూపని’ మిలియన్ వ్యూస్ సాధించటం పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకనిర్మాతలు. త్వరలో మిగిలిన పాటలను విడుదల చేసి సినిమాను కూడా…
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘ఆచార్య’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్…
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఇంటెన్సివ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఈ చిత్రం తర్వాత విభిన్న కథలతో తెరపై కనిపిస్తున్న ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను…
సోనీ లివ్ తెలుగు ఓటీటీని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అందులో అన్నీ వింత వింత కథా చిత్రాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. తొలి చిత్రం ‘వివాహ భోజనంబు’ తప్పితే అన్ని వర్గాలను అలరించే చిత్రమేదీ అందులో ఆ తర్వాత రాలేదు. బహుశా డిఫరెంట్ జానర్ మూవీస్ ద్వారానే తమ ఉనికిని చాటుకోవాలని ఆ సంస్థ భావిస్తోందేమో తెలియదు! లేదా అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా సోనీ లివ్ నిలవాలని భావించినా తప్పులేదు. ఎందుకంటే ఇవాళ ఆ…
ప్రముఖ దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా ‘రొమాంటిక్’. మూడేళ్ళ క్రితం ఆకాశ్ తో పూరి స్వీయ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రం నిర్మించారు. అది చేదు అనుభవాన్ని ఇవ్వడంతో ఈసారి కథ, చిత్రానువాదం, సంభాషణలు మాత్రం తాను అందించి, మెగా ఫోన్ ను అనిల్ పాదూరి చేతికిచ్చారు. ‘మెహబూబా’ను నిర్మించిన పూరి, ఛార్మినే ‘రొమాంటిక్’నూ తీశారు. కరోనా కారణంగా విడుదలలో చాలానే జాప్యం జరిగి, ఎట్టకేలకు ఈ ‘రొమాంటిక్’ శుక్రవారం జనం ముందుకు…
నాగశౌర్య, రీతూవర్మ తొలిసారి జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు వచ్చిన నాగశౌర్య ‘అశ్వద్థామ’ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేకపోయింది. అదే యేడాది రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై కరోనా దెబ్బ పడింది. ఈ యేడాది రీతూవర్మ నటించిన ‘నిన్నిలా – నిన్నిలా’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి.…
అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ. యమ్. ఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ మధు’. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ‘ఓ మధు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఆమెతో పాటే మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, అడిషినల్ యస్.పి. లక్ష్మణ్ తదితర…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా…
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ చేసిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నారు. ఆయనతో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణవంశీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ…
నాలుగేళ్ళ క్రితం నితిన్ ‘లై’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాశ్. ఆ తర్వాత సంవత్సరమే నితిన్ మూవీ ‘చల్ మోహన్ రంగా’లోనూ మేఘా నాయికగా నటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిత్రం ఏమంటే… ఆమె నటించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. బట్… ‘లై’ పాటలు హిట్ కావడంతో, యూత్ లో మేఘా ఆకాశ్ కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమిళ, హిందీ…