ఆసక్తి రేపుతోన్న’స్కైలాబ్’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్న కథాంశాలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. వసాగా విజయాలను అందుకుంటున్న ఈ హీరో మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. వాస్తవ ఘటనలకు కొద్దిగా హ్యూమర్ టచ్ ఇచ్చి విడుదల చేసిన ఈ ట్రైలర్ నవ్వులు పూయిస్తుంది.
ట్రైలర్ విషయానికొస్తే.. బండ లింగపల్లి అనే గ్రామంలో నివసించే గౌరమ్మ (నిత్యామీనన్) ప్రతిబింబం అనే వార్తాపత్రికల్లో పనిచేస్తుంటుంది. చిన్న చిన్న వార్తలు కాకుండా ఒక పెద్ద వార్త కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అదే గ్రామానికి ఆనంద్(సత్యదేవ్) అనే వ్యక్తి డబ్బు కోసం ఏదోకటి చేయాలనీ వస్తాడు. అక్కడ అతనికి సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) పరిచయమవుతాడు. ఇద్దరు డబ్బుకోసం ప్రయత్నాలు మొదలుపెడుతుండగా.. అనుకోని ఘటనగా అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. దీంతో ఆ గ్రామంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటాయి. ఈ వార్తను తనకనుగుణంగా మలుచుకోవడానికి గౌరీ, ఆనంద్, రామారావు ప్రయత్నించడం, ఆ గ్రహ శకలాలు ఆ గ్రామంలో పడకుండా గ్రామస్థులు చిత్ర విచిత్రమైన పద్ధతులు పాటించడం హాస్యభరితంగా చూపించారు. మొత్తంగా ట్రైలర్ మాత్రం చాలా ఆసక్తిగా కట్ చేశారు. మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించడం విశేషం. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ వారి పాత్రలకు జీవం పోసినట్లు కనిపించారు. గ్రామీణ నేపథ్యంలో ఫన్ ఎంటర్ టైన్మెంట్ గా రూపొందిన ఈ మూవీని డిసెంబర్ 4న విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
Also Read
- Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
- Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
- OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. 'ఓం' బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?
- Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
తాజావార్తలు
-
Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
-
26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
-
Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
-
Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
-
National Stock Exchange: భారత్‌కు మరో ఘనత.. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా రికార్డు..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!